హీరోయిన్ రా బాబు.. సీరియల్లో విలన్ సేస్తిరి.. నెట్టింట గ్లామర్ అటామ్ బాంబ్ ఈ బ్యూటీ..
సాధారణంగా సీరియల్ తారలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతిరోజూ బుల్లితెరపై అడియన్స్ ముందుకు వచ్చి అలరిస్తుంటారు. అందుకే ఈ సెలబ్రెటీలకు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తాజాగా ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అందులో ఆమెను చూసి క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్.

సీరియల్స్… బుల్లితెరపై ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో చెప్పక్కర్లేదు. రోటీన్ ఎమోషనల్ డ్రామాలతో సాగినప్పటికీ సీరియల్స్ చూసేవారి సంఖ్య మాములుగా ఉండదు. అలాగే సీరియల్స్ తారలకు ఉండే ఫాలోయింగ్ గురించిత తెలిసిందే. తమ నటనతోపాటు ఎక్స్ ప్రెషన్స్ సైతం హైలెట్ అవుతుంటాయి. తెలుగు సీరియల్స్ లో ఇప్పుడు ఇతర భాష నటీనటులదే హావా నడుస్తుంది. తమ నటనతో జనాలను మెప్పిస్తున్నారు. నిజానికి సీరియల్స్ లో హీరోయిన్స్ ఎప్పుడూ ఏడుస్తూ కనిపిస్తే.. కన్నింగ్ లుక్స్ లో జనాలకు విపరీతమైన కోపం తెప్పిస్తూ తమ పాత్రలో లీనమైపోతుంటారు విలన్స్. సినిమాల్లో నటులు ఎక్కువగా విలన్ గా ఉంటే.. సీరియల్స్ లో మాత్రం అందమైన తారలే విలన్స్. అందంలో ఏమాత్రం తగ్గని ముద్దుగుమ్మలు… బుల్లితెరపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించేందుకు రెడీ అవుతుంటారు. ఇప్పటికే చాలా మంది విలన్ పాత్రలతో అదరగొట్టేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తుంటారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న అమ్మడు సైతం ఆ జాబితాలోకి చెందినవారే.
ఇవి కూడా చదవండి : Serial Actress : సినిమాల్లో హీరోయిన్ కావాలనుకుంది.. కట్ చేస్తే.. సీరియల్స్‌లో విలన్ అయ్యింది.. గ్లామర్ క్వీన్ రా బాబూ..
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడును గుర్తుపట్టారా.. ? ఆమె పేరు ఐశ్వర్య వర్మ. జీ తెలుగులో ప్రసారమవుతున్న చామంతి సీరియల్ ద్వారా తెలుగు సినీప్రియులకు పరిచయమైంది. ఇందులో రోజా అనే విలన్ పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. డబ్బుపై ఆశతో..తల్లిదండ్రులను వదిలేసి పెద్ద కుటుంబంలో కోడలిగా సెటిల్ అయి.. ఆ తర్వాత ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. ఐశ్వర్య.. కన్నడలో పలు సీరియల్స్ చేస్తుంది.
బెంగుళూరులో పుట్టిపెరిగిన ఐశ్వర్య వర్మ.. నటి కావాలని ఎప్పుడూ అనుకోలేదని.. తన కుటుంబం, బంధువులలోనూ ఎవరూ సినీరంగంలో లేరని చెప్పుకొచ్చింది. ఫేస్ బుక్ లో షేర్ చేసిన ఒక్క ఫోటోతో తనకు సీరియల్ ఆఫర్స్ వచ్చాయని తెలిపింది. మొదట్లో యాక్టింగ్ అంటే ఫ్యామిలీ ఒప్పుకోలేదని తర్వాత ఓకే అన్నారని చెప్పింది. బంధన సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హీరోయిన్ రా బాబు.. అనవసరంగా సీరియల్ విలన్ సేస్తిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Amala Paul : ఆ సినిమాలో నటించి తప్పు చేశాను.. అప్పుడు నాకు 17 సంవత్సరాలే.. హీరోయిన్ అమలా పాల్..




