Upasana-Ram Charan: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ప్రిన్సెస్ రాకతో ఆనందంలో ఇరు కుటుంబాలు..
టాలీవుడ్‌లో ది మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ఉపాసనలు అమ్మానాన్నలుగా ప్రమోషన్ అందుకున్నారు. ప్రసవం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

టాలీవుడ్‌లో ది మోస్ట్ బ్యూటీఫుల్ అండ్ లవ్లీ కపుల్‌గా పేరొందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ఉపాసనలు అమ్మానాన్నలుగా ప్రమోషన్ అందుకున్నారు. ప్రసవం కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చారు.. ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ జోడీకి మంగళవారం తెల్లవారుజామున అంటే జూన్ 20న ఆడబిడ్డ పుట్టినట్లు జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ మెడికల్ బులెటిన్ విడుదల చేసింది
దీంతో కొణిదెల, కామినేని కుటుంబాలు ఆనందంలో మునిగిపోయాయి. మెగా ప్రిన్సెస్ రాకతో చిరంజీవి, సురేఖ, అనిల్ కామినేని, శోభనా కామినేని గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్‌లు అయ్యారు.




The mega power couple @AlwaysRamCharan & @upasanakonidela welcomed their first born, the #MegaPrincess, in the early hours of Tuesday ❤️#RamCharan #Upasana #GlobalStarRamCharan #GameChanger pic.twitter.com/c66kQMtEUW
— Suresh Kondeti (@santoshamsuresh) June 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..