AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh Kanagaraj: అభిమానులకు షాకిచ్చిన ‘లియో’ డైరెక్టర్.. సినిమాలకు గుడ్‌బై చెప్పిన లోకేష్ కనకరాజ్?

Lokesh Kanagaraj Quit Movies: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు కనకరాజ్ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పది సినిమాలు చేసిన తర్వాత కెరీర్‌కు స్వస్తి చెబుతానంటూ చెప్పుకొచ్చాడు.

Lokesh Kanagaraj: అభిమానులకు షాకిచ్చిన 'లియో' డైరెక్టర్.. సినిమాలకు గుడ్‌బై చెప్పిన లోకేష్ కనకరాజ్?
Lokesh Kanagaraj
Venkata Chari
|

Updated on: Jun 20, 2023 | 5:50 AM

Share

LEO: ‘ఖైదీ’ సినిమాతో అందర్ని తనవైపునకు తిప్పుకుని, ‘విక్రమ్’ మూవీతో కాసుల వర్షం కురిపించిన డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj).. ప్రస్తుతం విజయ్‌ (Vijay) హీరోగా ‘లియో’ (Leo) సినిమాను తీస్తున్నాడు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు గాంచిన లోకేష్ కనగరాజ్.. ఓ షాకింగ్‌ ప్రకటన చేశారు. 10 సినిమాలు చేసిన తర్వాత తన కెరీర్‌కు స్వస్తి చెబుతానంటూ షాకిచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.

హీరో విజయ్ బర్త్‌డే సందర్భంగా లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌లో పెద్దగా సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో నా ప్రయత్నమే చేయాలనుకుంటున్నాను. ఎల్‌సీయూ కాన్సెప్ట్‌ కేవలం నిర్మాతల సహకారంతోనే ఉంది. అందుకే నాపై నమ్మకం ఉంది. నేను పది సినిమాలు చేసి వెళ్ళిపోతాను” అంటూ చెప్పుకొచ్చాడు. హాలీవుడ్ దర్శకుడు క్వింటెన్ టరెంటీనో లాగే నేను కూడా 10 సినిమాల తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫ్యాన్స్ వరకు అంతా షాక్ అయ్యారు.

లోకేష్ 2017 సంవత్సరంలో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. కేవలం ఆరేళ్లలో అతను టాప్ డైరెక్టర్ల లిస్టులో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తలపతి విజయ్, విజయ్ సేతుపతి, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్‌లతో కలిసి పనిచేశాడు. హైపర్‌లింక్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అయితే, కైతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తలపతి విజయ్‌తో కలిసి తన ‘లియో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ డ్రామా అని చెబుతున్నారు. కాగా, ‘మాస్టర్’ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా భారీ షెడ్యూల్‌ను కశ్మీర్‌లో పూర్తి చేశారు. చెన్నైలో చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అక్టోబరులో లియోను విడుదల చేసేందుకు లోకేశ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో విజయ్‌ సరసన త్రిష నటిస్తోంది. ఈ సినిమాలో గౌతమ్ వాసుదేవ మేనన్‌, ప్రియా ఆనంద్‌, సంజయ్‌ దత్‌, శాండీ మాస్టర్‌, మిస్కిన్‌, మన్సూర్ అఖీఖాన్‌, మాథ్యూ థామస్‌ నటిస్తున్నారు.

లియో సినిమా తర్వాత కమల్‌హాసన్‌, రజనీకాంత్‌, కార్తీ, సూర్యలతో పనిచేయాల్సి ఉంది. అలాగే పాన్ ఇండియా స్టార్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తోనూ ఓ మూవీ చేస్తారనే వార్తలు కూడా వినిపించాయి. మరి, ఈ వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..