Venu Yeldandi: రెండో సినిమాపై అప్‌డెట్ ఇచ్చిన బలగం డైరెక్టర్ వేణు

ఒకప్పుడు పలు సినిమాల్లో కమిడియన్‌గా కనిపించిన వేణు.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నారు. ఆ తర్వాత అతను మొదటిసారిగా దర్శకత్వం వహించిన బలగం సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

Venu Yeldandi: రెండో సినిమాపై అప్‌డెట్ ఇచ్చిన బలగం డైరెక్టర్ వేణు
Venu Yeldandi
Follow us
Aravind B

|

Updated on: Jun 20, 2023 | 7:01 AM

ఒకప్పుడు పలు సినిమాల్లో కమిడియన్‌గా కనిపించిన వేణు.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నారు. ఆ తర్వాత అతను మొదటిసారిగా దర్శకత్వం వహించిన బలగం సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. చిన్న సినిమాగా వచ్చిన బలగం చిత్రం బ్లాక్‌బస్టర్ అయిన విషయం మనందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే డైరెక్టర్‌గా సత్తాచాటిన వేణు.. అతని రెండో చిత్రం ఏంటని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వేణు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. తను తీయబోతున్న రెండో సినిమా స్క్రిప్టు పనుల్ని సోమవారం నాడు ప్రారంభించానని సోషల్ మీడియాలో తెలిపాడు. ఇందుకు సంబంధించి పెన్ను, పేపర్ ఫోటోని కూడా షేర్ చేశారు.

దీనిపై నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం కూడా బలగం లాగే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరికొందరేమో మంచి యాక్షన్‌తో కూడిన థ్రిల్లింగ్ కథ రాయండని అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వేణు ఎలాంటి సినిమా తీయనున్నారు. అందులో హిరో హిరోయిన్‌లు ఎవరు అనే విషయాలు ఇంకా తెలియదు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్స్ రావాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. ఇదిలా ఉండగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు అద్దం పట్టేలా తీసిన బలగం చిత్రం పెద్ద హిట్ సొంతంచేసుకోగా.. ఓటీటీలో కూడా విశేషమైన ఆదరణ పొందింది. తెలంగాణలోని పలు గ్రామాల్లో ఈ సినిమాని ఊరంతా చూసేలా ప్రదర్శించడం మరో విశేషం. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..