PM Modi: వారందరికీ ధన్యవాదాలు.. అమెరికా పర్యటనకు ముందు ట్వీట్ చేసిన ప్రధాని మోడీ..

PM Modi US Visit Full Schedule: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం (జూన్ 20) అమెరికాలో ముఖ్యమైన పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి ఒక మైలురాయి అవుతుందని ఇరు ప్రభుత్వాలు భావిస్తున్నాయి.

PM Modi: వారందరికీ ధన్యవాదాలు.. అమెరికా పర్యటనకు ముందు ట్వీట్ చేసిన ప్రధాని మోడీ..
Pm Modi Us Visit
Follow us
Venkata Chari

|

Updated on: Jun 20, 2023 | 2:56 AM

PM Modi US Visit Full Schedule: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారం (జూన్ 20) అమెరికాలో ముఖ్యమైన పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి ఒక మైలురాయి అవుతుందని ఇరు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు ముందు, అమెరికన్ ప్రవాస భారతీయులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రధాని మోదీకి మద్దతుగా ఐక్యత ర్యాలీని నిర్వహిస్తున్నారు. అంతే కాదు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు అమెరికా ఎంపీలు తమ వీడియోలను విడుదల చేస్తున్నారు. మరోవైపు, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రజలు తన అమెరికా పర్యటనపై ఉత్సాహాన్ని పంచుకుంటున్నారని, ఇలాంటి విభిన్న మద్దతు భారత్-అమెరికా సంబంధాల లోతును తెలియజేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

జూన్ 20న అమెరికాకు ప్రధాని మోదీ..

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన మొదటి రోజున న్యూయార్క్‌లో ఉంటారు. న్యూయార్క్‌లో నిర్వహించే యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొని, ఆ తర్వాత వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత జూన్ 22 న వైట్‌హౌస్‌లో అధికారికంగా స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉన్నత స్థాయి సంభాషణను కొనసాగించడానికి అధ్యక్షుడు బిడెన్‌ను కలవనున్నారు.

ఇవి కూడా చదవండి

ఐరాసలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహాలు ముమ్మరం..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధికారిక పర్యటన సందర్భంగా జూన్ 21న 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గుర్తించిన తర్వాత 2015 నుంచి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అనేది ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో తన అధికారిక పర్యటన సందర్భంగా జూన్ 21న 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గుర్తించిన తర్వాత 2015 నుంచి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..