Duologue with Barun Das: బరున్ దాస్ ‘డుయోలాగ్ విత్ బరున్ దాస్’ టాక్ షోకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
భారతదేశపు అతిపెద్ద టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నెట్‌వర్క్ ఎండీ అండ్ సీఈవో బరున్ దాస్ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. అద్భుతమైన నాయకత్వం, ఆలోచనా ప్రక్రియల ద్వారా వినూత్న శైలిలో 'డుయోలాగ్ విత్ బరున్ దాస్' నిర్వహిస్తున్నందుకు గానూ IWMBuzz డిజిటల్ అవార్డ్ అందుకున్నారు.
భారతదేశపు అతిపెద్ద టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నెట్‌వర్క్ ఎండీ అండ్ సీఈవో బరున్ దాస్ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. అద్భుతమైన నాయకత్వం, ఆలోచనా ప్రక్రియల ద్వారా వినూత్న శైలిలో ‘డుయోలాగ్ విత్ బరున్ దాస్’ నిర్వహిస్తున్నందుకు గానూ IWMBuzz డిజిటల్ అవార్డ్ అందుకున్నారు. ఆదివారం ముంబైలోని గోరేగావ్‌లోని వెస్టిన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో బరున్‌దాస్‌కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేశారు. కాగా ప్రపంచంలోనే మొట్టమొదటి వార్తల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా ‘న్యూస్ 9 ప్లస్’ గుర్తింపు పొందింది. ఈక్రమంలో TV9 నెట్‌వర్క్ ఎండీ అండ్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తూనే ‘డుయోలాగ్ విత్ బరున్ దాస్’ అనే టాక్‌షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈక్రమంలోనే తన సేవలకు గుర్తింపుగానే IWMBuzz డిజిటల్ అవార్డ్-2023 అందుకున్నారు బరున్‌దాస్.
ఈ సందర్భంగా బరున్ దాస్ మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు, పురస్కారాలు తనను మరింత మెరుగ్గా పని చేసేందుకు ప్రేరేపిస్తుందన్నారు. న్యూస్ 9 ప్లస్ నెట్‌వర్క్‌ను నిష్పాక్షికమైన గ్లోబల్ ఒపీనియన్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చాలనే లక్ష్యంతో ప్రపంచంలోని మొట్టమొదటి వార్తల ఓటీటీగా రూపొందించామన్నారు. ఇది చాలా కాలం పాటు ప్రపంచ రంగంలో చాలా అవసరమైన ప్రయోజనాలను అందిస్తుందని బరున్ దాస్ పేర్కొన్నారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవానికి మీడియా, సినీ, పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మనోజ్ బాజ్‌పాయ్, కార్తీక్ ఆర్యన్, అపరశక్తి ఖురానా, సునీల్ శెట్టి, అదితీ రావ్ హైదరీ, రాశీ ఖన్నా, వాణి కపూర్, అలీ ఫజల్, హుమా ఖురేషి, రాజ్‌కుమార్ రావ్, తమన్నా భాటియా వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా బరున్ దాస్ ‘డుయోలాగ్ విత్ బరున్ దాస్’ అనే టాక్ షోలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు చెందిన పలువురు ప్రముఖులు, దిగ్గజాలు పాల్గొన్నారు. తమ జీవిత ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను అందరితో పంచుకున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమరూన్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, దేశ ఐటీ దిగ్గజం ఎన్.ఆర్. నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి, సద్గురు, మిథాలీ రాజ్ లాంటి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ‘డుయోలాగ్ విత్ బరున్ దాస్’ టాక్ షోలో పాల్గొన్నారు. న్యూస్9 ప్లస్ యాప్‌ను ఈ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..