Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. ఫ్లెక్సీలతో విషెస్ తెలుపుతున్న అభిమానులు.

చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఉపాసన గర్భం దాల్చిన దగ్గర నుంచి రామ్ చరణ్ ఆమెతోనే గడుపుతున్నారు. షూటింగ్స్ కు గ్యాప్ ఇస్తూ సతీమణితో ఆనందంగా గడుపుతూ వచ్చారు.

Ram Charan-Upasana: మెగా వారసురాలు వచ్చేసింది.. ఫ్లెక్సీలతో విషెస్ తెలుపుతున్న అభిమానులు.
Ram Charan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 20, 2023 | 8:05 AM

మెగా ఇంట ఆనందం వెల్లువిరిసింది.. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మానిచ్చారు. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. పెళ్లైన పదకొండు ఏళ్ల తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులు అయ్యారు. ఉపాసన గర్భం దాల్చిన దగ్గర నుంచి రామ్ చరణ్ ఆమెతోనే గడుపుతున్నారు. షూటింగ్స్ కు గ్యాప్ ఇస్తూ సతీమణితో ఆనందంగా గడుపుతూ వచ్చారు. రామ్ చరణ్ కు పుట్టబోయే బిడ్డకోసం మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తారు. నేటి తెల్లవారుజామున (జూన్ 20)న ఉపాసన ఆడపిల్లకు జన్మానించారు.

మెగా ఫ్యామిలీ లోకి మెగా ప్రిన్సెస్  ఎంట్రీ ఇవ్వడంతో ఇరు కుటుంబాల్లో ఆనందం వెల్లువిరిసింది, హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన బిడ్డకు జన్మానించారు. ఉపాసన డెలివరీకి నిన్నే హాస్పటల్ కు వచ్చారు. ఆమె తో పాటు తల్లి, చిరంజీవి సతీమణి సురేఖ, చరణ్ కూడా హాస్పటల్ కు వచ్చారు.

బిడ్డ పుట్టడంతో రామ్ చరణ్ రెండు నెలలు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు. ఈ రెండు నెలలు భార్య, కుతురుతో గడపనున్నారు. ఇక చరణ్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించడంతో దంపతులకు విషెస్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు, మెగా ఫ్యాన్స్. కొంతమంది అభిమానులు ఫ్లెక్సీల తో మెగా జంటకు విషెస్ తెలుపుతున్నారు. కంగ్రాట్స్ అన్న వదిన అంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు.