Rakul Preet Singh: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న సొగసరి.. రకుల్ రచ్చ మాములుగా లేదుగా..
అనంతరం ఒక తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది. ఏకంగా 12 తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో రాణించింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన వెంకటాద్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్ ప్రీత్. అనంతరం ఒక తమిళ్, హిందీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం వరుసగా తెలుగు సినిమాల్లో నటించింది. ఏకంగా 12 తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్‌లో దాదాపు అందరూ యంగ్ టాప్ హీరోల సరసన ఆడిపాడిన ఈ బ్యూటీ అనతికాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజింగ్ చేసిన ఈ చిన్నది బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ రాణించింది. హిందీలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే డాక్టరీ జీ మూవీతో థియేటర్లలో సందడి చేసిన రకుల్.. ప్రస్తుతం థాంక్స్ గాడ్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తుంది.
అక్టోబర్ 25న విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఫాంటసీ సోషల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించిన ఈ మూవీలో రకుల్ కథానాయికగా కాగా.. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హాత్రా ప్రధాన పాత్రలలో నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది.
తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందాలు ఆరబోస్తూ రకుల్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట హీటు పుట్టిస్తున్నాయి. సాగర తీరంలో అందాలను ఆరబోసిన ఈ అమ్మడి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..