Pushpa 2: స్పీడ్ పెంచనున్న సుకుమార్ టీమ్.. పుష్ప 2 షూటింగ్ ఎక్కువ శాతం అక్కడే జరగనుందట
మునుపెన్నడూ కనిపించని ఊరమాస్ లుక్ లో కనిపించారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించి పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయానికి అందుకోవడమే కాదు కాసుల వర్షం కురిపించింది. మునుపెన్నడూ కనిపించని ఊరమాస్ లుక్ లో కనిపించారు బన్నీ. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. ఇక ఇప్పటికే పుష్ప పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా జీవించేశాడని చెప్పొచు. ఆయన నటన, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో హిందీలోనూ అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధించింది.
ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. పార్ట్ 1 కంటే పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సెకండ్ పార్ట్ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొదటి భాగం సక్సెస్ అవ్వడంతో అభిమానుల్లో నెలకొన్ని బజ్ ని దృష్టిలో పెట్టుకునే రెండవ పార్ట్ కో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు సుకుమార్.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని హైదరాబాద్ లో ప్రారంభించి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఆ తరువాత టీమ్ కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అక్కడే రెండు నెలల పాటు షూటింగ్ చేయనున్నారట. ఆ తర్వాత తిరిగి మారేడుమిల్లి అడవుల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.