RRR : జపాన్‌లో దుమ్మురేపుతోన్న ఆర్ఆర్ఆర్ .. ఏకంగా అక్కడ టాప్ 10లో మన సినిమా
చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఫిక్షనల్ కథతో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు
తెలుగు సినిమా రేంజ్ ను కేవలం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్ . దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి ఫిక్షనల్ కథతో దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో గిరిజన వీరుడు కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ అల్లు అర్జున్ నటించి మెప్పించాడు. అయితే అసలు జరిగిన దానికి ఈ కథ పూర్తి డిఫరెంట్. ఎక్కడా కూడా వివాదానికి తావు ఇవ్వకుండా తెరకెక్కించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు జక్కన్న. ఇక ఈ సినిమాలో హీరోలిద్దరూ అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు. ఇతర దేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మన సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది.
ఇక రీసెంట్ గా ఈ సినిమాను జపాన్ లో విడుదల చేశారు. అక్కడ ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చేశారు హీరోలు తారక్ అండ్ చరణ్. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి . ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు జపాన్ లో భారీ రెస్పాన్స్ వస్తోంది.
జపాన్లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి తొలిరోజు ఏకంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. ఇండియాలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై దాదాపు ఏడు నెలలు అవుతోంది. అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. జపాన్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 10 స్థానంలో ఉంది. అక్కడ 1 నుండి 9 స్థానాల్లో అన్ని జపనీస్ యానిమేషన్ చిత్రాలు ఉన్నాయని టాక్. మన సినిమాకు జపాన్ లో ఇంత క్రేజ్ రావడంతో చిత్రయూనిట్ తోపాటు తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.