Urvasivo Rakshasivo : బాలయ్య గెస్ట్‌గా ''ఉర్వశివో రాక్షసీవో'' ప్రీరిలీజ్ ఈవెంట్..

Urvasivo Rakshasivo : బాలయ్య గెస్ట్‌గా ”ఉర్వశివో రాక్షసీవో” ప్రీరిలీజ్ ఈవెంట్..

Rajeev Rayala

|

Updated on: Oct 30, 2022 | 6:33 PM

ఈ క్రమంలోనే శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకున్న శిరీష్.. ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు.



అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల అలరిస్తున్నాడు అల్లు శిరీష్. గౌరవం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు శిరీష్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకున్న శిరీష్.. ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు. చివరిగా ఏబీసీడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు శిరీష్. ఈ సినిమాకు ఉర్వశివో రాక్షసీవో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ ఈవెంట్ కు నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Published on: Oct 30, 2022 06:32 PM