Rachita Ram: కూలీ సినిమాలో నటించిన ఈ బ్యూటీ చెల్లెలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మతిపోద్ది గురూ..
ఇటీవల బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో కూలీ ఒకటి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ రజీనికాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ పోషించి ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది రచితా రామ్. దీంతో ఆమె గురించి నెట్టింట తెగ వెతుకుతున్నారు ఫ్యాన్స్.

2025 ఏడాదిలో విడుదలై సూపర్ హిట్ అయిన చిత్రాల్లో కూలీ ఒకటి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ డ్రామాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున విలన్ పాత్రలో కనిపించగా.. అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో శ్రుతిహాసన్, రచితా రామ్, రెబామోనికాజన్, సత్యరాజ్ వంటి పలువురు తారలు ముఖ్య పాత్రలలో కనిపించారు. విడుదలకు ముందే మోనికా పాట రచ్చ చేసింది. ఇక అలాగే ఇందులో నాగార్జున, రజినీ స్టైల్, మేనరిజం, యాక్టింగ్ జనాలను కట్టిపడేశాయి. ఆగస్ట్ 14న విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనుూ దూసుకుపోతుంది.
ఈ చిత్రం సెప్టెంబర్ 11 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. అనిరుధ్ సంగీతం అందించగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇదిలా ఉంటే.. కూలీ చిత్రంలో నెగిటివ్ రోల్ పోషించి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది నటి రచితా రామ్. ఈ సినిమాతో రచితా రామ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. కేవలం కూలీ మాత్రమే కాకుండా తమిళంలో పలు చిత్రాల్లో నటించింది రచితా. విక్రమ్ సినిమాలో ఏజెంట్ దీనా పాత్రలో కనిపించింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’ గా రచితా రామ్ గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో విడుదలైన కన్నడ సినిమా పుల్బుల్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది.
View this post on Instagram
కన్నడలో శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కూలీ ఆమెకు తొలి తమిళ సినిమా. అలాగే తెలుగు, కన్నడలో వరుస అవకాశాలు అందుకుంది. ఇక రచితా రామ్ చెల్లెలు సైతం సినీరంగంలో ఫేమస్ హీరోయిన్. ఆమె పేరు నిత్యా రామ్. బుల్లితెరపై ఆమె క్రేజీ హీరోయిన్. 2012-13 మధ్య వచ్చిన అవల్ అనే సీరియల్ ద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది. అలాగే పలు చిత్రాల్లో నటించింది. నిత్యా రామ్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. 2015లో విడుదలైన ముట్ట మనసే సినిమాతో కన్నడ సినీరంగంలోకి అడుగుపెట్టింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




