Vishal: ఎంతో కష్టపడ్డాను.. కోట్లు ఇచ్చినా అలాంటి పాత్రలో మళ్లీ కనిపించను.. హీరో విశాల్..
కోలీవుడ్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్నాళ్లు అనారోగ్య సమస్యలతో సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇటీవల యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ అనే పాడ్ కాస్ట్ లో విశాల్ మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. తమిళంలో విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. పాత్రకు ఇంపార్టెన్స్, కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో విశాల్ సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు . మరోవైపు కొన్ని రోజుల క్రితం హీరోయిన్ సాయి ధన్సికతో నిశ్చితార్థం జరగ్గా.. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హీరో యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ అనే పాడ్ కాస్ట్ లో పాల్గొని తన కెరీర్, పర్సనల్ విషయాల గురించి పంచుకున్నారు. అలాగే తనకు అవార్డులపై నమ్మకం లేదని అన్నారు. జాతీయ పురస్కారాలు సహా తాను ఏ అవార్డులను నమ్మనని.. జ్యూరీగా ఉండే ఏడేనిమిది మంది బెస్ట్ యాక్టర్, బెస్ట్ మూవీని ఎలా డిసైడ్ చేస్తారు.. ? ఓ సర్వే నిర్వహించి ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించాలని అన్నారు. తనకు ఏదైనా అవార్డ్ వచ్చినా దానిని చెత్తబుట్టలో వేస్తానని.. ఒకవేళ అది బంగారంతో చేస్తే.. అమ్మేసి వచ్చిన డబ్బును ఛారిటీకి విరాళం ఇస్తా అన్నారు.
ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..
ఇక తన కెరీర్ లో సవాలు విసిరిన పాత్ర.. అవన్- ఇవన్. తెలుగులో వాడు వీడు పేరుతో విడుదల చేశారు. ఇక పై ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా అలాంటి పాత్రలో మళ్లీ నటించే ప్రసక్తే లేదని విశాల్ అన్నారు. ఆ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో శ్రమపడ్డానని తెలిపారు. బాల తెరకెకెక్కించిన ఈ సినిమా ఆర్య, విశాల్ ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించారు. 2011లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‌తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..
అలాగే సినిమాల్లో ఎంత కష్టమైన స్టంట్స్ చేస్తానని..కానీ డూప్ తో చేయించడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. యాక్షన్ చిత్రీకరించే క్రమంలో గాయాలు కాగా.. ఇప్పటివరకు తనకు 119 కుట్లు పడ్డాయని అన్నారు. ప్రస్తుతం విశాల్ పాడ్ కాస్ట్ ఫుల్ ఎపిసోడ్ యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ హీరో మకుటం, తుప్పరివాలన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‌గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..




