AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంచికొడుతున్న వానలు.. వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరో.. ఆందోళనలో అభిమానులు

వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కొంతమంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. అలాగే ఓ స్టార్ హీరో కూడా వరదల్లో చుక్కుకున్నాడు.

దంచికొడుతున్న వానలు.. వరదల్లో చిక్కుకున్న స్టార్ హీరో.. ఆందోళనలో అభిమానులు
Jammu And Kashmir
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2025 | 1:04 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసినా వర్షాలు, వరదలు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా  మారిపోయింది. చిన్న చిన్న కాలువల నుంచి పెద్ద పెద్ద చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఎంతో మంది వరదల్లో చిక్కుకున్నారు. ఎన్నో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అలాగే పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర రాష్ట్రాలలోనూ వరదల ధాటికి పెద్ద నగరాలతో పాటు చిన్న చిన్న గ్రామాలు కూడా అతలాకుతలం అవుతున్నాయి. వరదల్లో చుక్కుకున్న వారి కోసం ప్రభుత్వాలు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హెలికాఫ్టర్ సహాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే వరదల్లో ఓ స్టార్ హీరో కూడా చిక్కుకున్నాడు.

పిచ్చిలేపిందిగా.! కిక్ సినిమాలో ఇలియానా చెల్లి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

సోషల్ మీడియా వేదికగా తాను వరదల్లో చిక్కుకున్నాను అని తెలిపాడు ఆ స్టార్ హీరో.. ఇంతకూ అతను ఎవరో కాదు స్టార్ హీరో మాధవన్ . ఇక జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూకాశ్మీర్‌లో పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షం, వరదల కారణంగా లేహ్‌లో చిక్కుక్కుపోయినట్లు  మాధవన్ తెలిపాడు. సోషల్ మీడియాలో మాధవన్ చేసిన పోస్ట్ కు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

105 కేజీల బరువు పెరిగా.. పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

17 సంవత్సరాల తర్వాత నేను మరోసారి వర్షాల కారణంగా లేహ్‌లో చిక్కుకున్న అని తెలిపాడు మాధవన్. గతంలో త్రీ ఇడియట్స్ సినిమా కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా ఇలానే చిక్కుకున్నా .. ఇప్పుడు మరోసారి వరదల్లో చిక్కుకున్న.. ఏది ఏమైనా ఇది చాలా అందమైన ప్రదేశం.. ప్రస్తుతం విమానాలు లేవు అంటూ మాధవన్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. మాధవన్ ప్రస్తుతం తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తున్నారు.

బాప్ రే బాప్..! ఈమె ప్రేమిస్తే సినిమా హీరోయినా..? ఎంత మారిపోయింది..!!

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.