Pushpa 2: అయ్యాయో.. హీరో కటౌట్‌ని ఇలా మార్చేశారేందయ్యా.. పుష్ప 2 ట్రైలర్‏లో ఇతడిని గుర్తుపట్టారా..?

ఇప్పుడు సోషల్ మీడియాలో పుష్పగాడి రూల్ నడుస్తోంది. నవంబర్ 17న విడుదలైన పుష్ప 2 ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇందులోని ప్రతి సీన్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇందులో అరగుండుతో కనిపించిన నటుడు ఎవరా అని ఆరా తీస్తున్నారు నెటిజన్స్.

Pushpa 2: అయ్యాయో.. హీరో కటౌట్‌ని ఇలా మార్చేశారేందయ్యా.. పుష్ప 2 ట్రైలర్‏లో ఇతడిని గుర్తుపట్టారా..?
Pushpa 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2024 | 11:35 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో అరాచకం సృష్టిస్తున్నాడు పుష్పరాజ్. ఇక తర్వలోనే అటు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాడు. ముందు నుంచి ఊహించినట్లుగానే పుష్ప 2 ట్రైలర్ వైల్డ్ ఫైర్‏లా ఉంది. నిన్న పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుక చూసి అటు బీహార్ ప్రభుత్వం సైతం షాకయ్యిందంటే.. పుష్పరాజ్ క్రేజ్ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‏లో దూసుకుపోతుంది. కథ రివీల్ చేయకుండా సినిమా మొత్తాన్ని చిన్న చిన్న క్లిప్స్‏గా కట్ చేసి రిలీజ్ చేసిన ట్రైలర్‏కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ప్రతి ఒక్క నటుడిని కవర్ చేశారు. అప్పుడు పుష్ప మూవీలోని కీలకపాత్రలు పోషించిన యాక్టర్స్ కూడా ఇప్పుడు మరోసారి పుష్ప 2లోనూ సందడి చేయనున్నారు.

నిన్న విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ లో కనిపించిన ఓ నటుడిని చూసి జనాలు షాకయ్యారు. అరగుండు, మెడలో చెప్పుల దండతో కిల్లింగ్ స్మైల్‏తో నడిచి వస్తున్న పాత్ర ఈ ట్రైలర్ కే హైలెట్ అయ్యింది. దీంతో ఆ నటుడు ఎవరబ్బా అని తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. అతడి లుక్ స్క్రీన్ షాట్ తీసి మరీ గూగుల్లో జల్లెడ పట్టేస్తున్నారు. ఇంతకీ ట్రైలర్ లో ఆ అరగుండు, మెడలో చెప్పుల దండతో కనిపించిన ఆ నటుడు ఎవరో తెలుసా.. ఆ నటుడి పేరు తారక్ పొన్నప్ప.

ఇవి కూడా చదవండి

కన్నడ సినిమాల్లో కీలకపాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కేజీఎఫ్ మూవీలోనూ నటించాడు. ఇక ఇటీవలే ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించాడు. ఇందులో విలన్ సైఫ్ అలీఖాన్ కొడుకుగా కనిపించాడు. ఇప్పుడు పుష్ప 2లోనూ కీలకపాత్రలో నటించినట్లు తెలుస్తోంది. నిన్న ట్రైలర్ లో తన లుక్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ అన్నింటిని తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేశాడు తారక్ పొన్నప్ప.

గతంలో ఓ ఇంటర్వ్యూలో తారక్ పొన్నప్ప మాట్లాడుతూ.. పుష్ప 2లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించానని.. తన క్యారెక్టర్ మూవీ టర్న్ అయ్యే ట్విస్ట్ మాత్రమే కాకుండా పుష్ప లైఫ్ మారిపోయే ట్విస్ట్ అని చెప్పుకొచ్చాడు. అయితే అతడు ఏ పాత్ర పోషించాడనేది మాత్రం తెలియరాలేదు. ప్రస్తుతం తారక్ పొన్నప్ప పుష్ప 2 లుక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

పుష్ప 2 ట్రైలర్..  

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే