Kannappa : కన్నప్ప సినిమాలో ప్రభాస్ పెళ్లి టాపిక్.. థియేటర్లలో ఫ్యాన్స్ రచ్చ..
ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే కన్నప్ప సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు డార్లింగ్. ఈ చిత్రంలో రుద్ర పాత్రలో కనిపించారు. దీంతో ఈ సినిమాను డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్ సమయంలో థియేటర్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ మాములుగా లేదు.

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ కన్నప్ప. మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాపై మొదటి నుంచి భారీ హైప్ పెంచేశారు మేకర్స్. అలాగే ఇందులో పలువురు స్టార్స్ సైతం కీలకపాత్రలు పోషించడం మరో హైలెట్. ముఖ్యంగా ఈచిత్రంలో రుద్ర పాత్రలో నటించారు ప్రభాస్. దీంతో ఈ మూవీ కోసం కొన్ని నెలలుగా డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలోని పాటలు, విజువల్స్, బీజీఏం అద్భుతంగా ఉన్నాయని.. ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి నటించారని ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లైమాక్స్ చివరి 20 నిమిషాల్లో మంచు విష్ణు యాక్టింగ్ గూస్ బంప్స్ తెప్పించాయంటూ సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్రభాస్ పాత్ర వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు దద్ధరిల్లిపోయాయని తెలుస్తోంది.
శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో ప్రభాస్ ఎంట్రీ సీన్లు, ఆయన చెప్పిన డైలాగ్స్, ప్రభాస్ రాజసంతో నడిచే సీన్స్, క్లోజప్ షాట్స్ వీడియోస్, ఫోటోస్ తెగ షేర్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్, మంచు విష్ణు, ప్రభాస్ మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో మరో హైలెట్ ప్రభాస్ చెప్పే డైలాగ్. అందరి కంటే పెద్దొణ్ణి అంటూ డార్లింగ్ చెప్పిన డైలాగ్ తో పాటు మరిన్నిక్లిక్ అయ్యేలా కనిపిస్తున్నాయి.
ఇదంతా పక్కన పెడితే.. ఈ సినిమాలో ప్రభాస్ పెళ్లి టాపిక్ రావడం గమనార్హం. రుద్ర, కన్నప్ప పాత్రలకు మధ్య జరిగే సంభాషణలో పెళ్లి టాపిక్ వస్తుంది. నీకు పెళ్లి అయ్యిందా ? అని రుద్రను కన్నప్ప అడుగుతారట. నా పెళ్లి గురించి ఎందుకు లే అని ప్రభాస్ చెప్పే డైలాగ్ కు థియేటర్లలో ఫ్యాన్స్ గోల గోల చేశారు. ఇక వెంటనే కన్నప్ప.. పెళ్లి చేసుకుంటే తెలిసేది అని డైలాగ్ చెప్పడం.. ఆ సమయంలో థియేటర్లో చప్పట్లు, విజిల్స్ గట్టిగానే పడ్డాయి. ఈ సీన్ సమయంలో ప్రభాస్ అరుపులతో థియేటర్లు దద్ధరిల్లిపోయాయి. ఈ చిత్రంలో ప్రభాస్ తోపాటు మోహన్ లాల్, మోహన్ బాబు, కాజల్, అక్షయ్ కుమార్, మధుబాల, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..








