- Telugu News Photo Gallery Cinema photos Samantha Ruth Prabhu amd Sreeleela Recreate Pushpa Magic in stylish reunion
నార్త్ వీధుల్లో కిస్సిక్ బ్యూటీస్.. అస్సలు తగ్గేదేలే అంటున్న ముద్దుగుమ్మలు
ఒకరు ఊ అంటావా అంటే.. మరొకరు కిస్సిక్ మంటూ క్రేజీ ఫోజులిస్తున్నారు. ఒక్కొక్కరినీ చూడ్డానికే రెండు కళ్లూ చాలవనుకుంటే, ఒకరికి ఇద్దరు.. వీళ్ల వెనకే మరికొందరు... వారెవా.. గ్లామర్ షో అంటున్నారు నెటిజన్లు. తగ్గేదేలే.. అస్సలు తగ్గేదేలే అనే డైలాగుల్ని సినిమాల్లో పుష్పరాజ్ చెబుతుంటే, రియల్ లైఫ్‌లో ఆయన హీరోయిన్లు చేసి చూపిస్తున్నారు.
Updated on: Jun 28, 2025 | 12:39 PM

తగ్గేదేలే.. అస్సలు తగ్గేదేలే అనే డైలాగుల్ని సినిమాల్లో పుష్పరాజ్ చెబుతుంటే, రియల్ లైఫ్‌లో ఆయన హీరోయిన్లు చేసి చూపిస్తున్నారు. అస్సలు ఏమాత్రం తగ్గేదేలే అంటూ మోస్ట్ ఇన్‌ష్లూయెన్షియల్ యంగ్ ఇండియన్స్ ఈవెంట్‌లో హల్‌చల్ చేశారు సామ్ అండ్ శ్రీలీల.

పుష్ప2లో కిస్సిక్ సాంగ్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ డూపర్ పాపులారిటీ తెచ్చేసుకున్నారు శ్రీలీల. సౌత్‌లో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ఈ లేడీ, ఇప్పుడు ఆ ఒక్క సాంగ్‌తో నార్త్ లోనూ యమాగా క్లిక్ అయ్యారు.

నాట్ ఒన్లీ శ్రీలీల.. సమంత కూడా జీక్యూ మీట్‌కి హాజరయ్యారు. శ్రీలీల, సామ్‌ని చూడగానే ఆడియన్స్ అందరికీ పుష్ప సినిమాల్లో స్పెషల్ సాంగులు గుర్తుకొచ్చేస్తున్నాయి.

అందులోనూ ఇద్దరినీ సింగిల్ ఫ్రేమ్‌లో చూసిన వారు ఊ అంటావా మావా.. అంటూ సరదాగా హమ్ చేసుకుంటున్నారు.వీళ్లతో పాటు చాలా మంది సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. మాళవిక మోహనన్ కూడా అక్కడ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు.

రీసెంట్‌గా రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్‌తో మాళవికకు మన దగ్గర అమాంతం ఫ్యాన్స్ పెరిగిపోయారు. సామ్, శ్రీలీల రేంజ్ పాపులారిటీ టాలీవుడ్‌లో ఖాయం అనే మాటలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి.




