AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: ‘నాన్నా నువ్వెప్పుడూ ప్రజల హీరోవి’.. బాలయ్య ప్రమాణ స్వీకారంపై బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్

ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాలయ్యతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. దీంతో నందమూరి హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్ చేశారు. నందమూరి హీరో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న వీడియోను షేర్ చేసిన బ్రాహ్మణి..

Balakrishna: 'నాన్నా నువ్వెప్పుడూ ప్రజల హీరోవి'.. బాలయ్య ప్రమాణ స్వీకారంపై బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్
Nara Brahmani, Nandamuri Balakrishna
Basha Shek
| Edited By: |

Updated on: Jun 22, 2024 | 5:29 PM

Share

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం (జూన్ 21) ప్రారంభమయ్యాయి. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో హిందూపురం శాసన సభ్యుడిగా నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాలయ్యతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. దీంతో నందమూరి హీరోకు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నందమూరి బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి ఎమోషనల్ ట్వీట్ చేశారు. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్న వీడియోను షేర్ చేసిన బ్రాహ్మణి ‘నాన్నా… నువ్వెప్పుడూ ప్రజల హీరోవి. కథానాయకుడిగా, ప్రజా నాయకుడిగా నిరంతరం ప్రజల హృదయాల్లో ఉంటావు. వారిని సంతోషంగా ఉంచడానికి శ్రమిస్తావు. ఆల్ ది బెస్ట్ నాన్న!’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చారు.

అలాగే మంగళగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణం చేసిన తన భర్త నారా లోకేశ్ కు సైతం శుభాకాంక్షలు తెలిపింది బ్రాహ్మణి. ‘ఈరోజు నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ ఉద్విగ్న భరిత క్షణాలను మాకు సొంతం చేసిన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ కు శుభాకాంక్షలు’ అంటూ లోకేశ్ ప్రమాణ స్వీకారం చేస్తోన్న వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు కుప్పం ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తోన్న తన మామయ్యకు ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పారు బ్రాహ్మణి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తోన్న వీడియోను షేర్ చేసిన ఆమె ‘ఆంధ్రప్రదేశ్ లో ఒక స్వర్ణ శకం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రజలకు ఇక అంతా మంచే జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రిగా శాసనసభలో ప్రమాణం చేసిన శుభ సందర్భంగా మావయ్య గారికి అభినందనలు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

ప్రస్తుతం నారా బ్రాహ్మణి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.