AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Suriya: కల్తీ సారా తాగి 51 మంది మృతి.. ప్రభుత్వంపై హీరో సూర్య సీరియస్..

ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు. ఈ ఘటనపై తమిళ్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం పేరుతో విషాన్ని తాగుతున్నారని.. ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి కఠిన చట్టాలు చేయాలని కోరాడు హీరో సూర్య. ఇదే విషయమై తమిళనాడు ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ నోట్ రాశాడు.

Actor Suriya: కల్తీ సారా తాగి 51 మంది మృతి.. ప్రభుత్వంపై హీరో సూర్య సీరియస్..
Suriya
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2024 | 6:59 AM

Share

తమిళనాడులో కల్తీసారా తాగి 51 మంది మరణించిన ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కళ్లకురిచ్చి జిల్లా కరుణపురంలో కల్తీ మద్యం కాటుకు 51 మంది మరణించగా.. 116 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వీరిలో 34 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ తెలిపారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఎక్కువ శాతం మిథనాల్ కలిపిన సారాయి తాగడం వల్లే మరణాలు సంభవించినట్లు సీఎం అన్నారు. ఈ ఘటనపై తమిళ్ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం పేరుతో విషాన్ని తాగుతున్నారని.. ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి కఠిన చట్టాలు చేయాలని కోరాడు హీరో సూర్య. ఇదే విషయమై తమిళనాడు ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ నోట్ రాశాడు.

“‘ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మంది చనిపోవడం తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం. ఇంకా వంద మందికి పైగా ఆస్పత్రిలోనే ఉండడం కలకలం రేపుతోంది. వరుస మరణాలు, బాధితుల రోదనలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. కల్తీ మద్యానికి తమ వారిని కోల్పోయిన వారి రోదనలను ఏమాటలు ఓదార్చగలవు..? ఇప్పుడు రాజకీయ పార్టీలు, ఉద్యమాలు, మీడియా, ప్రజలు తమ దృష్టిని, ఆందోళనను, ఆగ్రహాన్ని చూపిస్తున్నారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం సత్వరమే చర్యలు చేపట్టి నష్టాలను తగ్గించుకునేందుకు, నష్టాన్ని తగ్గించడానికి ఓదార్పునిస్తుంది. కానీ దీర్ఘకాలిక సమస్యకు స్వల్పకాలిక పరిష్కారం అనేది పనిచేయదు. గతేడాది విల్లుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం తాగి 22 మంది చనిపోయారు . ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరో జిల్లాలో కూడా అదే మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయారు. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం. తమ బతుకులు బాగుపడాలని ఓట్లు వేసే తమిళనాడు ప్రజలు, ఇరవై ఏళ్లకు పైగా మనల్ని పాలించిన ప్రభుత్వాలు టాస్మాక్ పెట్టి ప్రజలను బలవంతంగా తాగించే దుస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ‘మద్యపాన విధానం’ అనేది అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయ నినాదంగా ఉపయోగపడుతుంది.

టాస్మాక్‌లో రూ.150కి తాగే మందు బాబులు డబ్బులు లేని సమయంలో రూ.50కి లభించే నకిలీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. మద్యపానం చేసేవారికి సమస్య కాదు.. ప్రతి కుటుంబానికి, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని మనందరం ఎప్పుడు గ్రహిస్తాం?. ప్రభుత్వాలు స్వయంగా మద్యపానాన్ని ప్రోత్సహించి 2 సంవత్సరాలుగా సొంత ప్రజలపై చేస్తున్న హింసను వెంటనే ఆపాలి. మద్యానికి బానిసైన వారిని బయటకు తీసుకురావడానికి ప్రతి జిల్లాలో పునరావాస కేంద్రాలు ప్రారంభించాలి. విద్యార్ధుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దార్శనికతతో కూడిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లే, మద్యపాన వ్యసనపరుల పునరావాసానికి కూడా ఆదర్శప్రాయమైన కార్యక్రమాలను రూపొందించి ఉద్యమంలా అమలు చేయాలి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు దూరదృష్టితో వ్యవహరిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి విషాద మరణాలను అరికట్టవచ్చు. తమిళనాడు ముఖ్యమంత్రి స్వల్పకాలిక పరిష్కారాన్ని ఆమోదిస్తారని నిషేధ విధానంపై ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రజలతో పాటు నేను ఆశిస్తున్నాను. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో విఫలమైన పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నాను. మృతులకు ప్రగాఢ సంతాపం. ఆసుపత్రిలో ఉన్నవారు కోలుకోవాలి. ఇకమీదట కొత్త చట్టం చేద్దాం. మేము దానిని ఎప్పటికీ రక్షిస్తాము ” అంటూ బహిరంగ లేఖ రాశాడు సూర్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.