Rashmika Mandanna: మళ్లీ వివాదంలో రష్మిక.. ఆ ఒక్క మాటతో.. ఇంతకీ ఏం చేసిందంటే..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీద దూసుకుపోతుంది. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే కొన్నాళ్లుగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ పై నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇంతకీ ఈసారి ఏం చేసిందంటే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. కొన్నాళ్లుగా వరుస హిట్లతో దూసుకుపోతుంది. ఇటీవలే యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కుబేర సినిమాతో మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ధనుష్, అక్కినేని నాగార్జున కీలకపాత్రలు పోషించారు. ప్రస్తుతం రష్మిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ భామ మరోసారి చిక్కుల్లో పడింది. కొన్ని రోజులుగా తన కామెంట్లతో కన్నడిగుల ఆగ్రహానికి గురవుతున్న రష్మిక.. ఇప్పుడు మరోసారి విమర్శలు ఎదుర్కొంటుంది. ఇంతకీ ఏం చేసిందంటే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మాట్లాడుతూ.. ‘కొడవ కమ్యునిటీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె తీరుపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కొడవ కమ్యునిటీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు.
‘మోజో స్టోరీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన్న మాట్లాడుతూ.. “మా కొడవ కమ్యూనిటీ నుంచి ఎవరూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. మా కొడవ సమాజం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి నేనే కావచ్చు.. మా కమ్యూనిటీ చాలా తీర్పు చెప్పేది. నేను ఆడిషన్స్ చేస్తున్నానని నా కుటుంబానికి చెప్పలేదు. సినిమాల్లోకి వెళ్తానని కూడా చెప్పలేదు” అని తెలిపింది. దీంతో రష్మిక కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
భారతీయ చిత్ర పరిశ్రమలో చాలా ఫేమస్ అయిన హీరోయిన్ ప్రేమ సైతం కొడవ సమాజానికి చెందిన అమ్మాయి. రష్మిక కంటే ముందే ప్రేమ సౌత్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే హర్షిక పూనచ్చ, కృషి థపండ, నిధి సుబ్బయ్య, డైసీ బోపన్న, శ్వేత చంగప్ప వంటి చాలా మంది నటీనటులు కొడవ కమ్యునిటీకి చెందినవారు కావడం గమనార్హం.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..