Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3BHK Review: సిద్ధార్థ్‌ 3BHK రివ్యూ.. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా

3BHK Review: సిద్ధార్థ్‌ 3BHK రివ్యూ.. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా

Phani CH
|

Updated on: Jul 05, 2025 | 12:13 PM

Share

తెలుగు తెరకు దూరమైన సిద్ధార్థ్‌.. తమిళ తెరపై మాత్రం.. కొత్త కంటెంట్‌తో వెలిగిపోయే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నటుడిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నాన్ని చాలా సీరియస్‌గా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆఫ్టర్ చిన్ని.. సిద్ధార్థ్‌ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ 3BHK. జస్ట్ సినిమా రిలీజ్‌కు వారం ముందు రిలీజ్‌ అయిన ట్రైలర్‌తో.., అందరినీ భావోద్వేగాన్ని గురిచేసిన ఈ సినిమా..!

థియేటర్లోనూ అదే కంటిన్యూ చేస్తుందా? మనసుకు హత్తుకునేలాగే.. మిడిల్ క్లాస్ జీవితాన్ని ప్రతిబింబించేలానే ఈ సినిమా ఉందా? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ…. ఇక త్రీ బీహెచ్‌కే కథలోకి వెళితే… వాసుదేవ్‌ అలియాస్ శరత్‌ కుమార్‌ది మధ్యతరగతి కుటుంబం. హైదరాబాద్‌లో ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలన్నది తన కల. దాన్ని సాకారం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దీంతో తన కలను కొడుకు ప్రభు అలియాస్ సిద్ధార్థ్‌ భుజాన పెడతాడు. కానీ, ఆ కొడుకు అప్పటికే కెరీర్‌ పరంగా అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటుంటాడు. 34ఏళ్ల వయసొచ్చినా సరైన ఉద్యోగం లేక తండ్రిపైనే ఆధారపడి జీవిస్తుంటాడు. మరి ఈ నేపథ్యంలో తన తండ్రి కలను నెరవేర్చేందుకు ప్రభు ఏం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? ఈ కథలో మీథా రఘునాథ్, చైత్రల పాత్రలేంటి? అన్నది మిగతా కథ. సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. అది కల మాత్రమే కాదు.. సగటు మిడిల్ క్లాస్ ఇంటి పెద్ద గౌరవం కూడా..! అయితే ఈ కల ప్లస్ గౌరవం మధ్య… పేద, మధ్యతరగతి కుటుంబాలు.. ఎలాంటి జర్నీ చేస్తారు. ఎన్ని కష్టాలు పడతారో… ఎన్ని త్యాగాలు చేస్తారో.. చూపించింది ఈ సినిమా..! పడే కష్టాలు.. కార్చే కన్నీళ్లు.. సొంతింటి కోసం ఆరాటాలు.. ఓ భావోద్వేగ ప్రయాణంలా సాగుతుంది త్రీ బీహెచ్‌కే మూవీ. సినిమా సహజంగా చాలా నాచురల్‌గా ఉంటుంది. ఇందులోని పాత్రలు రోజూ మన మధ్య చూస్తున్న పాత్రల్లాగే కనిపిస్తాయి. కాకపోతే, ఈ ప్రయాణమంతా ఓ మెగా సీరియల్‌లా సాగుతూ.. సాగుతూ… వెళుతుంది. కథనంలో వేగం లేకపోవడం.. ఊహకు అందేలా సన్నివేశాలు ఉండడమే ఈ సినిమాకు బిగ్ మైనస్‌. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే.. ! డైరెక్టర్ శ్రీ గణేష్‌ ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌ జొప్పించకుండా… క్లీన్‌ గా… ఈ సినిమాను తెరకెక్కించడమే! కానీ.. ప్రొడ్యూసర్ జేబు నిండాలంటే… కమర్షియల్ ఎలిమెంట్స్‌ ఒకటో అరో.. ఉండాల్సిందే కదా.. డైరెక్టర్ ఇదే మిస్సయినట్టు అనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆగస్ట్ 1 తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాలను.. OTTల్లో చూడలేరు..

స్పూన్‌ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..

ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

జాలరి పంట పండింది పో.. వలలో పడింది చూసి మైండ్ బ్లాక్

కేరళ నరమేధంపై ఒళ్లు గగుర్పొడిచే ఫిల్మ్..! డోంట్ మిస్ ఇట్ !