కేరళ నరమేధంపై ఒళ్లు గగుర్పొడిచే ఫిల్మ్..! డోంట్ మిస్ ఇట్ !
ఈ మధ్యన సంచలనాలుగా మారిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్‌గా చిలకలూరి పేట బస్సు దహనం కేసు ఆధారంగా వచ్చిన... 23 సినిమా బాగానే ఆడటమే గాక అందరి ప్రశంసలందుకుంది. అటు.. ఓటీటీలోనూ గొప్ప రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.
అదే..టోవినో థామస్ నటించిన నరివెట్ట మూవీ. 2003లో కేరళలో జరిగిన ఓ నరమేధం ఆధారంగా ఈ మూవీని.. తెరకెక్కించారు డైరెక్టర్ అనురాజ్ మనోహర్. 2003లో ముత్తంగ అనే ఆదివాసీ తెగవారు తమ భూహక్కుల కోసం పోరాటం చేయగా.. దానిని పోలీసులు అత్యంత క్రూరంగా అణచివేసిన తీరును ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. గిరిజనులను అక్కడి నుంచి తరిమేసే నేపథ్యంలో గిరిజనులు, పోలీసుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. మేలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ.30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.అంతేకాదు IMDBలోనూ 7.5 రేటింగ్ దక్కింది. అయితే తెలుగులో ‘నక్కలవేట’ పేరుతో వచ్చిన ఈ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. తెలుగులో పెద్ద ప్రచారం లేకపోయేసరికి.. ఈ మూవీ వచ్చిందని కూడా చాలామందికి తెలీదు. అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథను అబిన్ జోసెఫ్ అందించాడు. సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడు ఇందులో మరో కీలక పాత్ర పోషించాడు. మలయాళంలో అంతటి ఘన విజయం సాధించిన ఈ నరివెట్ట మూవీ జులై 11 నుంచి. సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుందని స్ట్రీమింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. మలయళంతో పాటు అన్ని పాన్ ఇండియా భాషల్లో రానున్నఈ మూవీపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మలయాళ యాక్షన్ డ్రామాను మీరు కూడా మిస్సవ్వకుండా చూసేయండి మరి!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ’18 ఏళ్లకే ప్రేమ.. తనే భర్తంటూ టాటూ..’ తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పి షాకిచ్చిన సామ్

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
