ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే
ఓ వైపు.. భూకంపం వచ్చి భవనాలన్నీ ఊగిపోతున్నాయి. ఆ టైంలో ఎవరైనా ఏం చేస్తారు?. ప్రాణ భయంతో బయటకు పరుగులు తీస్తారు. కానీ ఓ బుడతడు చేసిన పనికి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చైనాలో ఇటీవల జరిగిన భూకంపం సమయంలో ఓ చిన్నారి చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. జూన్ 23న గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.
అయితే పెద్దగా నష్టం జరగలేదు. అయితే ఈ సందర్భంగా ఓ ఇంట్లో జరిగిన ఘటన తాలూకు వీడియో బయటకు వచ్చింది. ఓ ఇంట్లో ఓ తండ్రి తన ఇద్దరు కొడుకులతో భోజనం చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో భూమి కంపించింది. తండ్రి తన చిన్న కుమారుడిని ఎత్తుకుని తలుపు వైపు పరుగెత్తాడు. పెద్ద కుమారుడు కూడా వెంటపడ్డాడు. కానీ.. ఆ చిన్నారి ఒక్కసారిగా వెనక్కి తిరిగి వచ్చి, టేబుల్ దగ్గరికి వెళ్లి తినడం ప్రారంభించాడు. పైగా బౌల్‌లో ఉన్న ఆహారాన్ని తీసుకుని బయటకు పరిగెత్తే ప్రయత్నం చేశాడు. తండ్రి.. పరిగెత్తు! అని అరిచాడు. అయినా ఆ బుడ్డోడు భోజనం ముందు అన్నట్లు వ్యవహరించాడు. ఈ వైరల్ వీడియోపై ఆ తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడికి తినడం చాలా ఇష్టమనీ అన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తిండి కంటే జీవితం ముఖ్యమని ఇక మీదైనా నేర్పించాలని తెలిపాడు. నెటిజన్ల స్పందన.. ఆ పిల్లవాడి ప్రాధాన్యతలు అద్భుతం అనీ భూకంపం వచ్చినా, తిండిని వదలడు! అని ఒకరు భూకంపం.. బుల్లి బకాసరుడు అంటూ ఇంకొందరు కామెంట్లతో హోరెత్తించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జాలరి పంట పండింది పో.. వలలో పడింది చూసి మైండ్ బ్లాక్
కేరళ నరమేధంపై ఒళ్లు గగుర్పొడిచే ఫిల్మ్..! డోంట్ మిస్ ఇట్ !
Samantha: ’18 ఏళ్లకే ప్రేమ.. తనే భర్తంటూ టాటూ..’ తన ఫస్ట్ లవ్ స్టోరీ చెప్పి షాకిచ్చిన సామ్
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

