Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిఫరెంట్‌ పాత్రలో కీర్తి సురేశ్‌ ఆకట్టుకుందా ??  ఉప్పు కప్పురంబు రివ్యూ

డిఫరెంట్‌ పాత్రలో కీర్తి సురేశ్‌ ఆకట్టుకుందా ?? ఉప్పు కప్పురంబు రివ్యూ

Phani CH
|

Updated on: Jul 05, 2025 | 12:14 PM

Share

ఓ వైపు కమర్షియల్ సినిమాలు.. మరో వైపు కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ.. తన కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటూ... దాంతో పాటే నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్‌... రీసెంట్‌గా ఉప్పుకప్పురంబు సినిమాతో మన ముందుకు వచ్చారు. సుహాస్ మరో లీడ్ చేశారు. థియేటర్స్‌లోకి కాకుండా... నేరుగా అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చిన ఈ సెటైరికల్ కామెడీ సినిమా.

ఎలా ఉందో తెలుసుకోవాలంటే.. వాచ్ అవర్ రివ్యూ… ఇక ఉప్పు కప్పురంబు సినిమా కథలోకి వెళితే… సుమారు 300 ఏళ్ల చరిత్ర ఉన్న ‘ చిట్టి జయపురం’ అనే గ్రామానికి పెద్దగా.. సుబ్బరాజు అలియాస్ శుభలేఖ సుధాకర్ ఉంటారు. అయితే, ఆయన మరణించడంతో అతని కుమార్తె అపూర్వ అలియాస్ కీర్తి సురేష్ గ్రామ పెద్దగా మారుతారు. అయితే వయసులో చిన్నపిల్ల అయిన అపూర్య గ్రామ పెద్ద ఏంటి..? అంటూ భద్రయ్య అలియాస్ బాబూ మోహన్, మధు అలియాస్ శత్రు తీవ్రంగా వ్యతిరేఖిస్తారు. ఈ క్రమంలోనే వారిద్దరు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం పోరాడుకుంటూ… అపూర్వను ఇబ్బంది పెడుతుంటారు. కట్ చేస్తే… గ్రామ పెద్దగా ఉన్న అపూర్వకు ఒక విచిత్ర సమస్య వచ్చి పడుతుంది. గ్రామంలో ఎవరు మరణించినా వారి ఆచారం ప్రకారం ఉత్తరాన మాత్రమే పాతిపెట్టడం ఆనవాయితీగా ఉంది. కానీ ఆ శ్మశానం నిండిపోయిందని అక్కడి కాపరిగా ఉండే చిన్న అలియాస్ సుహాస్ గుర్తిస్తాడు. ఇంకో నలుగురికి మాత్రమే అక్కడ చోటు ఉందని.. ఈ సమస్యను పరిష్కరించాలని అపూర్వను కోరుతాడు. గ్రామ సభ ఏర్పాటు చేసిన అపూర్వ ఆ నలుగురిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తుంది. కానీ, సడెన్‌గా జరిగిన ఒక ప్రమాదంలో అదే రోజు మరో నలుగురు మరణిస్తారు. తప్పని పరిస్థితిలో వారిని అక్కడ పాతిపెట్టాక శ్మశానంలో హౌస్‌ఫుల్‌ అని బోర్డు పెట్టేస్తారు. కట్ చేస్తే… ఆ శ్మశానంలో ఇంకొకరికి చోటు ఉంటుంది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా చిన్న దాచిపెడతాడు. అలా అతను ఎందుకు చేశాడు..? గ్రామానికి ఉత్తరం దిక్కున మాత్రమే స్మశానం ఎందుకు ఉండాలని నిర్ణయం తీసుకున్నారు..? శ్మశాన కాపరిగా ఉన్న చిన్న చేసిన మోసం వల్ల అపూర్వకు ఎదురైన చిక్కులు ఏంటి..? ఫైనల్‌గా అపూర్వ కనుగొన్న పరిష్కారం ఏంటి..? అనేది తెలియాలంటే ఉప్పు కప్పురంబు సినిమా చూడాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

3BHK Review: సిద్ధార్థ్‌ 3BHK రివ్యూ.. ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామా ఆకట్టుకుందా

ఆగస్ట్ 1 తర్వాత ఈ సూపర్ హిట్ సినిమాలను.. OTTల్లో చూడలేరు..

స్పూన్‌ మింగేశాడు.. ఆర్నెల్ల తర్వాత వైద్యపరీక్ష చేయగా..

ఓ వైపు భూకంపం.. మరో వైపు తిండి యావ.. బుడతడు చేసిన పని చూస్తే మైండ్ బ్లాకే

జాలరి పంట పండింది పో.. వలలో పడింది చూసి మైండ్ బ్లాక్