Tollywood: ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి.. హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్..

కంటెంట్ నచ్చితే చాలు స్టార్ హీరోస్ లేకపోయినా కొన్ని సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటాయి. చిన్న సినిమాలు థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఒక చిన్న సినిమాతో హీరోయిన్స్ సైతం కుళ్లుకునేలా చేసింది ఓ వయ్యారి. తాజాగా ఆమె ఫోటోస్ వైరలవుతున్నాయి.

Tollywood: ఒక్క సినిమాతో హీరోయిన్స్ కుళ్లుకునేలా చేసిన వయ్యారి.. హాట్‏నెస్‏కు కేరాఫ్ అడ్రస్..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 21, 2024 | 11:47 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమాతో మెప్పించింది ఓ హీరోయిన్. చిన్న సినిమాగా ఎలాంటి హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించింది. ఫస్ట్ మూవీతోనే కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అవుకుంటున్నారా..? ఆమె మరెవరో కాదండి.. హుషారు మూవీ బ్యూటీ.. ప్రియా వడ్లమాని.

2018లో వచ్చిన హుషారు సినిమాతో తెలుగు సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ప్రేమించిన వాడిని మోసం చేసే అమ్మాయిగా నటించి మెప్పించింది. హుషారు సినిమాతో యూత్ లో ఫాలోయింగ్ పెంచుకుంది. అంతకు ముందు ప్రేమకు రెయిన్ చెక్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాతోనే చాలా ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

కానీ ఆ తర్వాత మాత్రం అనుకున్నంతగా ఆఫర్స్ అందుకోలేకపోయింది. హుషారు మూవీ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ అందుకోలేదు. చివరిగా ఓం భీమ్ బుష్ సినిమాలో కనిపించింది. అంతకు ముందు.. ఆవిరి, కాలేజ్ కుమార్, ముఖచిత్రం, మను చరిత్ర సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ప్రియా వడ్లమాని. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.