AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: 17 ఏళ్లకే బ్లాక్ బస్టర్ హీరోయిన్.. ఒక్క ప్లాప్ సినిమాతో కెరీర్ నాశనం.. ఇప్పుడు మురికివాడలలో..

మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. 17 ఏళ్ల వయసులోనే స్టార్ హీరో జోడిగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఆమె జీవితం ఊహించని మలుపులు తిప్పింది. ఒక్క ప్లాప్ ఆమె కెరీర్ నాశనం చేసింది. ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది.

Telugu Cinema: 17 ఏళ్లకే బ్లాక్ బస్టర్ హీరోయిన్.. ఒక్క ప్లాప్ సినిమాతో కెరీర్ నాశనం.. ఇప్పుడు మురికివాడలలో..
Pooja Dadwal
Rajitha Chanti
|

Updated on: Jul 03, 2025 | 9:49 AM

Share

సినీరంగుల ప్రపంచంలో అందం, అభినయంతో తనదైన ముద్ర వేసింది. అద్భుతమైన నటనతో వెండితెరపై సందడి చేసి.. ప్రేక్షకులను అలరించిన ఆమె జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు మురికి వాడలలో నివసిస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ? కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఒక్క సినిమా ప్లాప్ కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన హీరోయిన్ పూజా దద్వాల్. తన తొలి సినిమాతోనే సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేసే అవకాశం లభించింది. కానీ ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అప్పట్లో ఆమెకు ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉండేది. 17 ఏళ్ల వయసులో పూజా దద్వాల్ 1995లో సల్మాన్ ఖాన్ చిత్రం ‘వీర్‌గతి’లో అరంగేట్రం చేసింది.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆమె అవకాశాల కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘ఆషికి’ (1999) తర్వాత ‘ఘరానా’ (2001) చిత్రంలో కనిపించింది. ఈ రెండు సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ పూజాకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. వివాహం తర్వాత పూజా గోవాలో నివసించింది. కొన్నేళ్లుగా సినీరంగానికి దూరంగా ఉన్న పూజా.. 2018లో టిబి బారిన పడి ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. పూజ గోవాలోని ఒక క్యాసినోలో మేనేజర్‌గా పనిచేస్తూ, చికిత్స కోసం ముంబైకి వచ్చింది.

ఆమెకు టీబీ వ్యాధి ఉందని తెలియడంతో కుటుంబం దూరం పెట్టింది. ఆమె గురించి తెలుసుకున్న సల్మాన్ ఖాన్.. సంవత్సరంపాటు ఆమె చికిత్స, ఆహర ఖర్చులన్నింటినీ భరించారు. అలాగే నటుడు రవి కిషన్ సైతం ఆమెకు సహాయం చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత పూజాకు ఉండేందుకు ఇల్లు లేదు. దీంతో ముంబైలోని మురికివాడలలో నివసించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఆమెను ఓ ఇంట్లో అద్దెకు ఉండి ఆమె ఖర్చులను భరించారు. ఇప్పటికీ ఆమె సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్