Kalki 2898 AD: రయ్..రయ్.. ప్రభాస్ ‘బుజ్జి’ కారును నడిపిన ఆనంద్ మహీంద్రా.. వీడియో ఇదిగో
ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు అభిమానుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కల్కి ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. కాగా కల్కి సినిమాలో ప్రభాస్ కారు 'బుజ్జి' హైలెట్ గా నిలవనుంది. అందుకు తగ్గట్టుగానే బుజ్జి కోసం గట్టిగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ప్రభాస్ కల్కి 2898 AD ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో భారీ తారగణమే కనిపించనుంది. బాలీవుడ్ అందాల భామలు దీపికా పదుకొణె (హీరోయిన్), దిశా పటానీ (స్పెషల్ రోల్) ఈ సినిమాలో సందడి చేయనున్నారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బ్రహ్మానందం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న కల్కి జూన్ 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషనల్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ కు అభిమానుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం కల్కి ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. కాగా కల్కి సినిమాలో ప్రభాస్ కారు ‘బుజ్జి’ హైలెట్ గా నిలవనుంది. అందుకు తగ్గట్టుగానే బుజ్జి కోసం గట్టిగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భైరవ (ప్రభాస్) బుజ్జి ఈవెంట్‌ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించగా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం ప్రభాస్ బుజ్జి కారు దేశమంతటా చక్కర్లు కొడుతోంది. పలువురు ప్రముఖులు ఈ కారును నడుపుతున్నారు. ఇప్పటికే హీరో నాగచైతన్య, ఫార్ములా వన్ రేసన్ నారయణన్ కార్తికేయన్ తదితర ప్రముఖులు ఈ కారును డ్రైవ్ చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. తాజాగా కల్కి బుజ్జి కారును ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నడిపారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ (ఎక్స్) లో షేర్ చేసింది. ‘బుజ్జి మీట్స్ ఆనంద్ మహీంద్రా అంటూ’ అని ఈ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది.
వీడియో ఇదిగో..
#Bujji meets @anandmahindra…#Kalki2898AD #Kalki2898ADonJune27 pic.twitter.com/gZETpmPf7e
— Kalki 2898 AD (@Kalki2898AD) June 12, 2024
వైజయంతీ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి సినిమాలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నాడు. అలాగే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రను పోషించనున్నారు. అలాగే రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నాబెన్ తదితరులు వివిధ పాత్రల్లో మెరవనున్నారు. సంతోష్ నారాయణన్ కల్కి సినిమాకు స్వరాలు సమకూర్చారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు అందించారు.
ప్రభాస్ కల్కి ట్రైలర్ .. ఇదిగో..
ముంబైలో చక్కర్లు కొడుతోన్న ప్రభాస్ బుజ్జి కారు.. వీడియో
Aamchi Mumbai’s real superhero also wants to drive our Bujji 🔥 Heartwarming visuals from Juhu Beach, Mumbai 😄 ❤️#Kalki2898AD @BelikeBujji @MumbaiPolice pic.twitter.com/6ioxpvrWWr
— Kalki 2898 AD (@Kalki2898AD) June 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








