- Telugu News Photo Gallery Cinema photos Actress Ruhani Sharma Stunning Half Saree Look Photos Goes Viral
Ruhani Sharma: లంగావోణీలో రుహానీ శర్మ.. స్టన్నింగ్ లుక్స్‌తో చంపేస్తోన్న వయ్యారి..
చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ సిమ్లా సుందరి. ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించింది. తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Updated on: Jun 12, 2024 | 5:39 PM

చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రుహానీ శర్మ. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది ఈ సిమ్లా సుందరి. ఆ తర్వాత తెలుగులో అందం, అభినయంతో నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటించింది.

తెలుగులో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కంటెంట్ ప్రాధాన్యత చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రుహానీ శర్మ ఒక్క ఫోటో పెట్టిందంటే చాలు నెట్టింట లైక్స్ వర్షంలా కురుస్తుంటాయి.

మోడ్రన్ డ్రెస్ అయినా.. సంప్రదాయ లుక్ అయినా సరే అభిమానులను కట్టిపడేయం ఈ బ్యూటీకే సాధ్యం అన్నట్లుగా ఉంటుంది. తాజాగా రుహానీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. లంగావోణీలో పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది.

రెండు జడలతో లంగావోణీలో మెరిసిపోతూ..మేకపిల్లతో సరదాగాఆడుతూ ఫోటోలకు ఫోజులిచ్చింది. పల్లెటూరి అందం ఉట్టిపడేలా కనిపిస్తున్న రుహానీ శర్మ ఫోటోస్ ఇప్పుడు నెటిజన్స్ మనసు దోచేస్తున్నాయి.

దీంతో రుహానీ శర్మ లేటేస్ట్ ఫోటోస్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రుహానీ శర్మ మాస్క్ చిత్రంలో నటిస్తుండగా.. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.




