- Telugu News Photo Gallery Cinema photos Prabhas says he will stay on his word said to fans on releasing a movie every 6 months
Prabhas: చెప్పిందే చేస్తాను.. చేసేదే చెప్తాను అంటున్న ప్రభాస్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
చెప్పిందే చేస్తాను.. చేసేదే చెప్తాను.. అదేదో సినిమాలో రజినీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా..? ఇప్పుడు ఇదే మాటను ప్రభాస్ ఫాలో అవుతున్నారు. రెండేళ్ల కింద ఫ్యాన్స్‌కు ఓ మాటిచ్చారు ప్రభాస్. కష్టమో నష్టమో అదే మాటపై ఇప్పటికీ నిలబడ్డారు.. ఇంకా ఇచ్చిన మాట కోసం పాటు పడుతూనే ఉన్నారు. టాలీవుడ్‌లో కేవలం ప్రభాస్ మాత్రమే ఈ మాటపై నిలబడ్డారు. ఒట్టేసి ఓ మాట.. వేయకుండా ఓ మాట చెప్పనమ్మా అంటూ ఛత్రపతిలో చెప్పారు కదా ప్రభాస్.. దాన్నే రియల్ లైఫ్‌లోనూ చేసి చూపిస్తున్నారు.
Updated on: Jun 12, 2024 | 7:23 PM

చెప్పిందే చేస్తాను.. చేసేదే చెప్తాను.. అదేదో సినిమాలో రజినీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ గుర్తుంది కదా..? ఇప్పుడు ఇదే మాటను ప్రభాస్ ఫాలో అవుతున్నారు. రెండేళ్ల కింద ఫ్యాన్స్‌కు ఓ మాటిచ్చారు ప్రభాస్. కష్టమో నష్టమో అదే మాటపై ఇప్పటికీ నిలబడ్డారు.. ఇంకా ఇచ్చిన మాట కోసం పాటు పడుతూనే ఉన్నారు. టాలీవుడ్‌లో కేవలం ప్రభాస్ మాత్రమే ఈ మాటపై నిలబడ్డారు.

ఒట్టేసి ఓ మాట.. వేయకుండా ఓ మాట చెప్పనమ్మా అంటూ ఛత్రపతిలో చెప్పారు కదా ప్రభాస్.. దాన్నే రియల్ లైఫ్‌లోనూ చేసి చూపిస్తున్నారు. బాహుబలి కోసం ఐదేళ్లు తీసుకున్న ప్రభాస్.. సాహో కోసం కూడా మూడేళ్ల టైం తీసుకున్నారు. దాంతో ఇకపై ఇంత గ్యాప్ ఉండదంటూ.. అప్పట్లో మాటిచ్చారు ప్రభాస్. చెప్పినట్లుగానే ఆర్నెళ్లకో సినిమా విడుదల చేస్తున్నారు రెబల్ స్టార్.

2022లో సాహో వచ్చింది.. గతేడాది జూన్‌లో ఆదిపురుష్.. డిసెంబర్‌లో సలార్ విడుదలయ్యాయి. ఇప్పుడు జూన్ 27న కల్కి రాబోతుంది. ఇది కూడా మొదటి భాగం మాత్రమే. కల్కి వచ్చిన ఆరేడు నెలలకే మారుతి రాజా సాబ్ విడుదల కానుంది.

దీని షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తైంది. కల్కి తర్వాత దీనిపైనే ఫోకస్ చేయనున్నారు ప్రభాస్. రాజా సాబ్ సెట్స్‌పై ఉండగానే.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మొదలు కానుంది. దీని తర్వాత హను రాఘవపూడి సినిమా లైన్‌లో ఉంది.

వాటితో పాటే సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. అన్నింటినీ ఓ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తున్నారు ప్రభాస్. మొత్తానికి ఇకపై ఏడాదికి రెండు సినిమాలు విడుదల చేస్తా అనే మాటను నిలబెట్టుకుంటున్నారు ప్రభాస్. ఇదే మిగిలిన వాళ్లంతా ఫాలో అయితే ఇండస్ట్రీకి పండగే.




