- Telugu News Photo Gallery Cinema photos BB 4 Movie to Bharatheeyudu 2 latest movie updates from film industry
Movie Updates: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. థగ్‌లైఫ్ @ పాండిచ్చేరి..
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దళపతి విజయ్‌తో నటించాలని ఉందని అన్నారు నటి అనన్య పాండే. తనకున్న అరుదైన వ్యాధిని బయటపెట్టారు ఆదా శర్మ. భారతీయుడు 2 తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు నటి రకుల్ ప్రీత్‌సింగ్. కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థగ్‌లైఫ్.
Updated on: Jun 12, 2024 | 3:59 PM

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. సూపర్‌డూపర్ బ్లాక్‌బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్‌కి సంబంధించి గుడ్‌న్యూస్ చెప్పేశారు మేకర్స్. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. హిందూపురం వేదికగా ముహూర్తం ఘనంగా జరిగింది.

దళపతి విజయ్‌తో నటించాలని ఉందని అన్నారు నటి అనన్య పాండే. విజయ్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. అందుకే తెలుగు మీద కాకుండా, తమిళ్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారు అనన్య. ప్రస్తుతం గోట్ సినిమాలో నటిస్తున్న విజయ్ ఇంకొక్క సినిమా మాత్రమే చేస్తానని ఆల్రెడీ ప్రకటించారు.

తనకున్న అరుదైన వ్యాధిని బయటపెట్టారు ఆదా శర్మ. సినిమాల కోసం బరువు తగ్గుతూ, పెరుగుతూ ఉండటం వల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ అయిందని అన్నారు. ఒత్తిడి పెరగడంతో ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి సోకినట్టు చెప్పారు. దీనివల్ల 48 రోజులు చాలా ఇబ్బందిపడినట్టు తెలిపారు.

భారతీయుడు 2 తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు నటి రకుల్ ప్రీత్‌సింగ్. తాను ఇప్పటిదాకా అలాంటి కేరక్టర్ చేయలేదని అన్నారు. అనుకున్నదాన్ని ఎలా సాధించాలో తనకు చాలా బాగా తెలుసని చెప్పారు. సినిమాలోనూ అలాంటి కేరక్టరే చేశానని అన్నారు. సినిమా రిలీజ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నట్టు చెప్పారు.

కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా థగ్‌లైఫ్. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ పాండిచ్చేరిలో పూర్తయింది. కమల్‌హాసన్ మీద ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఇంకో 40 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉంది.




