Jani Master: కుమారుడిపై బెంగ.. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన జానీ మాస్టర్ తల్లి.. ఐసీయూలో చికిత్స
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం (అక్టోబర్ 11) గుండె పోటుకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొల్లి నేని ఆసుపత్రికి తరలించారు.
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తల్లి బీబీజాన్ కు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. కుమారుడు జైలుకు వెళ్లడంతో బెంగ పెట్టుకున్న ఆమెకు శనివారం (అక్టోబర్ 11) గుండె పోటుకు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు బీబీ జాన్ ను నెల్లూరు బొల్లి నేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ సతీమణి ఆయేషా ఆస్పత్రికి వచ్చారు. తన అత్తమ్మ ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు. బీబీ జాన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని జానీ మాస్టర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ కేసులో జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ కు సంబంధించి రంగా రెడ్డి కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవలే దీనిపై వాదనలు విన్న రంగారెడ్డి ప్రత్యేక పోక్సో కోర్టు జానీ బెయిల్పిటిషన్ ఈ నెల 14 కు వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
ఇదిలా ఉంటే 2022 గాను జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ఎంపికయ్యారు. పురష్కారాన్ని ఈ నెల 8న దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో అందిస్తామని జానీ మాస్టర్‌కు ఆహ్వానం కూడా అందింది. దీంతో ఈ అవార్డు అందుకోవడానికి జానీ మాస్టర్ మధ్యంతర బెయిల్ కూడా అప్లై చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా జానీ మాస్టర్‌కు ప్రకటించిన జాతీయ పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నేషనల్ ఫిల్మ్అవార్డు కమిటీ ప్రకటించింది. జానీ మాస్టర్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అవార్డుల కమిటీ పేర్కొంది. అయితే జానీ మాస్టర్ కు జాతీయ అవార్డును నిలిపివేయడంపై టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను ఎంతో కష్టపడి ఈ అవార్డు తెచ్చుకున్నాడని, వ్యక్తిగత సమస్యలను సాకుగా చూపి అవార్డు రద్దు చేయడం అన్యాయమని ప్రముఖ కొరియో గ్రాఫర్ ఆట సందీప్, యానీ మాస్టర్ తదితరులు మండి పడ్డారు. అలాగే ప్రముఖ నటుడు, దర్శకుడు బండి సరోజ్ కూడా జానీకి మద్దతుగా ట్వీట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..