Unstoppable With NBK 4: సూపర్ హీరోగా బాలయ్య.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే

తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న టాక్ షోస్‌ లో ఆహా 'అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' ఒకట. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సెలబ్రిటీ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా ముస్తాబవుతోంది. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని కొత్త సీజన్ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Unstoppable With NBK 4: సూపర్ హీరోగా బాలయ్య.. అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ చూశారా? స్ట్రీమింగ్ డేట్ ఇదే
బుల్లితెర మీద బాలయ్య పండుగకు రంగం సిద్ధమైంది. తెలుగు ఆడియనన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అన్‌స్టాపబుల్‌ నయా సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.
Follow us
Basha Shek

|

Updated on: Oct 12, 2024 | 5:23 PM

తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకున్న టాక్ షోస్‌ లో ఆహా ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ ఒకట. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఈ సెలబ్రిటీ టాక్‌ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కు కూడా ముస్తాబవుతోంది. తాజాగా దసరా పండగను పురస్కరించుకుని కొత్త సీజన్ ఫస్ట్ లుక్, ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య.. సూపర్ హీరోగా కనిపించాడు. సుమారు నాలుగున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక అక్టోబరు 24వ నుంచి అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఈ కొత్త సీజన్ లో ఎన్ని ఎపిసోడ్‌లు ఉంటాయి? అతిథులుగా ఎందరు కనిపిస్తారు? అన్నిటిన్నా మించి సీజన్‌4 ఫస్ట్ ఎపిసోడ్‌ గెస్ట్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 4 కు సంబంధించి తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించారు. బాలకృష్ణ, అల్లు అరవింద్‌, అనిల్‌ రావిపూడి, తేజస్విని నందమూరిమ, రాజీవ్‌ చిలక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య ఈ టాక్ షో గురిచి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సినిమాల్లో తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా తాజాగా విడుదలైన అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ కు సరిపోదా శనివారం ఫేమ్ జేక్స్ బెజోయ్‌ సంగీతం అందించడం విశేషం. ఇదిలా ఉంటే ఈ దసరాకి NBK-109 రిలీజ్‌ కావాలి. ఐతే.. ఎలక్షన్ల కారణంగా NBK-109 షూటింగ్‌ ఆలస్యం అయ్యింది. దసరాకి రిలీజ్ కుదరలేదు. ఈ నేపథ్యంలోనే సినిమా వాయిదాపడినా అన్‌స్టాపబుల్‌ షోతో ముందుకు వస్తున్నారు బాలకృష్ణ. కాగా మొదటి ఎపిసోడ్ కు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ టీమ్ అతిథులుగా రానున్నారని తెలుస్తోంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సందడి చేయనున్నాడని తెలుస్తోంది.  త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది.

పండుగ సమయం వచ్చేసింది..  అక్టోబర్ 24 నుంచి కొత్త సీజన్ స్ట్రీమింగ్..

అన్‌స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్  ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..