Hardik Pandya: ‘పాము విషంతో పార్టీలు చేసుకునే వాడితో నీకేందుకమ్మా’! బిగ్ బాస్ విజేతతో నటాషా తిరగడంపై ఫ్యాన్స్
నటాషా మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె ఒక ఆల్బమ్ సాంగ్ లోనూ కనిపించింది. అయితే హార్దిక్ తో విడాకుల తర్వాత నటాషా మళ్లీ ప్రేమలో పడిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ OTT విజేత ఎల్విష్ యాదవ్‌తో నటాషా డేటింగ్ చేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి.
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, ప్రముఖ నటి నటాషా స్టాంకోవిచ్ కొన్ని రోజుల క్రితమే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. దీని తర్వాత హార్దిక్, నటాషా తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయిపోయారు. హార్దిక్ క్రికెట్ మ్యాచ్ లతో బిజీగా ఉంటుంటే, నటాషా మళ్లీ సినిమాల్లోకి వచ్చేందుకు శత విధాలా ప్రయత్నిస్తోంది. ఇటీవల ఆమె ఒక ఆల్బమ్ సాంగ్ లోనూ కనిపించింది. అయితే హార్దిక్ తో విడాకుల తర్వాత నటాషా మళ్లీ ప్రేమలో పడిందని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ OTT విజేత ఎల్విష్ యాదవ్‌తో నటాషా డేటింగ్ చేస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టగానే వీరిద్దరు కలిసి తిరుగుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీనిపై అభిమానులు, నెటిజన్ల నుంచి భిన్న రకాలుగా స్పందనలు వస్తున్నాయి. కాగా క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న నటాషా తన కుమారుడిని తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితమే ఆమె మళ్లీ తిరిగి ముంబైకు వచ్చింది. అప్పటి నుంచి ఎల్విస్ యాదవ్‌తో ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందని నెట్టింట చర్చ జరుగుతోంది.
తాజాగా నటాషా, ఎల్విష్ కు సంబంధించి ఒక వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది. అందులో ముంబైలోని ఓ హోటల్ ముందు ఎల్విస్, నటాషా కారు దిగుతున్నట్లు ఉంది.అయితే వీరిద్దరూ ఒకే కారులో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరూ విడివిడిగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇక నటాషా తన వెనక వస్తుందో లేదో పలుసార్లు వెనక్కి తిరిగి చూశాడు ఎల్విష్. ఈ వీడియోపై హార్దిక్ పాండ్యా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్వీష్ యాదవ్‌కు సమాజంలో మంచి పేరు లేదంటూ, పాము విషం సేకరించిన కేసులో అరెస్ట్ కూడా అయ్యాడంటూ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం తమ పాటను ప్రమోట్ చేసుకునేందుకే ఇలా తిరుగుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎల్విస్, నటాషా డేటింగ్ లో ఉన్నారా? లేదా? అన్నది వారు క్లారిటీ ఇస్తే కానీ తెలియదు.
ఎల్విష్ యాదవ్ తో నటాషా స్టాంకోవిచ్.. వీడియో..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.