AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2024: కల్కి టూ మంజుమ్మెల్ బాయ్స్.. 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే..

IMDb Popular Indian Movies: IMDB 2024లో అత్యంత పాపులర్ మూవీస్ జాబితాను విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రం అగ్రస్థానంలో నిలిచింది. అలాగే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలోని పలు హిట్ చిత్రాలు సైతం ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి.

Year Ender 2024: కల్కి టూ మంజుమ్మెల్ బాయ్స్.. 2024లో అత్యంత పాపులర్ మూవీస్ ఇవే..
Kalki, Manjummel Boys
Rajitha Chanti
|

Updated on: Dec 12, 2024 | 1:02 PM

Share

ఈ ఏడాది అత్యంత పాపులర్ అయిన సినిమాలు ఏంటో తెలుసా.. భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలే కాదు.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను చూసేందుకు కూడా జనాలు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఈ ఏడాది అత్యంత  పాపులర్ అయిన సినిమాల జాబితాను ఐడీఎంబీ రిలీజ్ చేసింది. అదంులో కల్కి, స్త్రీ సినిమాలు టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఆ తర్వాత మహారాజా, మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలతోపాటు మరికొన్ని పాన్ ఇండియా మూవీస్, ప్రాంతీయ చిత్రలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిన్న సినిమాలు నిలిచాయి. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలు సైతం ఈ జాబితాలో చేటు సంపాదించుకున్నాయి. 2024లో జనాలు ఎక్కువగా అభిమానించి ఆసక్తి కనబరచిన సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.

2024లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చలనచిత్రాలు:

1. కల్కి 2898 ఏడీ.

ఇవి కూడా చదవండి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం కల్కి 2898 ఏడి. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్టించింది.

2. స్త్రీ 2..

బాలీవుడ్ స్టార్స్ రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన సినిమా స్త్రీ 2. హారర్ కామెడీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇటీవలే పుష్ప 2 ద్వారా 2024లో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం నిలిచింది.

3. మహారాజా

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమా ఈ ఏడాదిలో అత్యంత విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాగా నిలిచింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ కీలకపాత్రలు పోషించారు.

4. షైతాన్..

బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆర్. మాధవన్, జ్యోతిక కీలకపాత్రలు పోషించిన సినిమా షైతాన్. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.

5. ఫైటర్..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. దేశభక్తి యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరోగా నటించారు. పుల్వామా దాడి, బాలాకోట్ వైమానిక దాడితో సహా 2019లో జరిగిన కీలక సైనిక సంఘటనల ఆధారంగా రూపొందించారు.

6. మంజుమ్మెల్ బాయ్స్

చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమా కొడైకెనాల్‌లో విహారయాత్రలో ఊహించని మలుపు తిరుగుతున్న స్నేహితుల బృందం కథను చెబుతుంది. అనుక్షణం ఉత్కంఠ, కామెడీ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

7. భూల్ భులయ్యా 3..

బీటౌన్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 3 సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో విద్యాబాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ కీలకపాత్రలు పోషించారు. హారర్ కామెడీ సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది.

8. కిల్..

కరణ్ జోహార్ నిర్మించిన కిల్ చిత్రానికి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ మూవీలో లక్ష్య, రాఘవ్ జుయాల్, ఆశిష్ విద్యార్థి కీలకపాత్రలు పోషించారు.

9. సింఘం ఎగైన్

రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ స్టార్-స్టడెడ్ సింగం ఎగైన్ దీపావళి సందర్భంగా విడుదలైంది. ఇందులో అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, టైగర్ ష్రాఫ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ కీలకపాత్రలు పోషించారు.

10. లాపటా లేడీస్..

స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన సినిమా లాపటా లేడీస్. ఈ మూవీ 97వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.