Bigg Boss 8 Telugu: వారెవ్వా.. గౌతమ్‏ని టైటిల్‏కి దగ్గర చేసే AV.. మనసుని హత్తుకుని రేంజ్‏లో ఎలివేషన్..

బిగ్‏బాస్ చరిత్రలో గౌతమ్ కృష్ణ ప్రయాణం ప్రత్యేకం. సీజన్ 7లో అడుగుపెట్టి బలమైన కంటెస్టెంట్లకే గట్టిపోటీ ఇచ్చాడు. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు వైల్డ్ ఎంట్రీగా సీజన్ 8లోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా మారాడు.

Bigg Boss 8 Telugu: వారెవ్వా.. గౌతమ్‏ని టైటిల్‏కి దగ్గర చేసే AV.. మనసుని హత్తుకుని రేంజ్‏లో ఎలివేషన్..
Gautham Krishna
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2024 | 1:35 PM

అప్పుడు ఎలిమినేట్ అయ్యాడు.. కానీ ఇప్పుడు టైటిల్ రేసులో ముందున్నాడు. బిగ్‏బాస్ చరిత్రలోనే గౌతమ్ ప్రయాణం చాలా స్పెషల్. సీజన్ 7లో సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బలమైన కంటెస్టెంట్లను పాయింట్ టూ పాయింట్ క్వశ్చన్ చేస్తూ.. టాస్కులలోనూ సత్తా చాటాడు. కానీ ఊహించని విధంగా ఎలిమినేట్ అయి బయటకు వచ్చాడు. కానీ ఇప్పుడు అదే కుర్రాడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి హీరోగా మారాడు. అప్పటికే టైటిల్ రేసులో ముందున్న నిఖిల్ ను సైతం వెనక్కు నెట్టాడు. ఎలాంటి గ్రూప్ గేమ్ లేకుండా ఒంటరిగా పోరాడాడు. స్నేహం పేరుతో మోసం ఎదురైన నవ్వుతూ పక్కకు తప్పుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయాలను చెబుతూ సూపర్ హీరో రేంజ్ ఎలివేషన్లతో గౌతమ్ ఏవీ రిలీజ్ చేశాడు బిగ్‏బాస్.

తాజాగా విడుదలైన ప్రోమోలో ముందుగా గౌతమ్ జర్నీ ఏవీ ప్లే చేశారు. గార్డెన్ ఏరియాలో గౌతమ్ జర్నీకు సంబంధించిన ఫోటోలు, క్రాకర్స్ తో స్వాగతం పలికారు. అలాగే గౌతమ్ జర్నీ గురించి చెబుతూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు బిగ్‏బాస్. ముఖ్యంగా గౌతమ్ జర్నీని ఎంతో అందంగా వివరించారు.

‘లక్ష్యాన్ని చేధించేందుకు మీకున్న ఏక్రాగతను చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. మీకు మానవ సంబంధాలు లేవని.. అన్నీ ప్రేక్షకుల కోరకే చేస్తారని తోటి సభ్యులు మీపై ఎన్ని ఆరోపణలు చేసినా అవన్నీ వారి ఆటలో భాగమని మీకు తెలుసు. వారు ఊహించని విధంగా వారిపైన దాడి చేశారు. కాస్త ప్రేమను కోరుకున్నప్పుడు ఆ ప్రేమ మీకు లభించకపోయినా ఆ అల్లరి మీ ఆటను ప్రభావితం చేయకుండా చూసుకున్నారు. అప్పటి నుంచి పాదరసంలా కదులుతూ మీ ఆట ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగింది. మీ పంథా మార్చకుండా మీ లక్యం వైపు కదిలారు. ఫైనలిస్ట్ గా నిలిచి చివరి మజిలీకి చేరుకున్నారు ‘ అంటూ ఓ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడు. ఇక బిగ్‏బాస్ మాటలు వింటూ భావోద్వేగానికి గురయ్యాడు గౌతమ్. అతడి జర్నీలో ఎదురైన ప్రతి విషయాన్ని కవర్ చేస్తూ పొగడ్తల వర్షం కురిపించాడు బిగ్‏బాస్. ఈరోజు రాత్రి ఎపిసోడ్ లో గౌతమ్ జర్నీ ఏవీ మరింత హైలెట్ కానుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
ప్రేమించే భాగస్వామి, పిల్లలు కావాలి.! 2025లో సమంత జాతకం..
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం నా అదృష్టం - శోభిత.. వీడియో.
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
పుష్ప-2పై మళ్లీ ట్వీట్ చేసిన వర్మ.! ఇది పాన్‌ ఇండియా మూవీ కాదు..
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
ప్రతీ శుక్రవారం ఆమెను వెంటాడుతోంది.ఇప్పటికే 11సార్లు కాటేసిన పాము
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మా నాన్న పోలీస్.. నాకేం కాదు.! కారుపై యువకుడు హల్‌చల్‌.. వీడియో.
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
మునగాకుతో మూడింతల అందం.. అస్సలు మిస్ కావద్దు.!
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
రాత్రికిరాత్రే ఎండిపోతున్న చెట్లు అయోమయంలో ప్రజలు! ఏం జరిగిందంటే?
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
మామను చెప్పుతో కొట్టిన కోడలు.! అడ్డుకున్న పెంపుడు శునకం..
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
తెల్లగా ఉంది కదాని.. కొబ్బరిపొడి అనుకుంటే పొరపాటే.! వీడియో వైరల్.
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..
ప్రపంచ రికార్డ్‌ క్రియేట్‌ చేసిన వివాహం. వధువుకి, వరుడికి..