గుర్తుపట్టలేనంతగా మారిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్! డిగ్రీ పట్టాతో తీసుకున్న ఫొటోలు వైరల్
సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్ మొదలుపెట్టిన వారు చూస్తుండగానే ఎదిగిపోతుంటారు. నిన్న మొన్నటి వరకు బుడిబుడి అడుగులతో, అమాయకపు చూపులతో అలరించిన చిన్నారులు.. ఒక్కసారిగా పట్టభద్రులుగా మారిపోతే ప్రేక్షకులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆశ్చర్యమే కలిగిస్తోంది విక్టరీ ..

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్ మొదలుపెట్టిన వారు చూస్తుండగానే ఎదిగిపోతుంటారు. నిన్న మొన్నటి వరకు బుడిబుడి అడుగులతో, అమాయకపు చూపులతో అలరించిన చిన్నారులు.. ఒక్కసారిగా పట్టభద్రులుగా మారిపోతే ప్రేక్షకులకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఆశ్చర్యమే కలిగిస్తోంది విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ సినిమా ‘దృశ్యం’లో ఆయన చిన్న కూతురిగా నటించిన నటి. అవును, ఆ సినిమాలో అను అలియాస్ అనుపమగా కనిపించి తన నటనతో అందరినీ ఏడిపించిన ఆ చిన్నారి, ఇప్పుడు కాలేజీ విద్యను పూర్తి చేసి పట్టా అందుకుంది.
ఆమె మరెవరో కాదు.. మలయాళ నటి ఎస్తేర్ అనిల్. కేరళకు చెందిన ఈ భామ తాజాగా తన గ్రాడ్యుయేషన్ పూర్తయినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఆమె తన డిగ్రీని పూర్తి చేసింది. కాన్వొకేషన్ డ్రెస్ ధరించి, పట్టా అందుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్న ఫోటోలను ఆమె షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. “చదువు పూర్తి చేయడం అనేది నా జీవితంలో ఒక గొప్ప ఘట్టం” అంటూ ఆమె ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంది.

Esther Anil
ఎస్తేర్ అనిల్ కేవలం తెలుగు ‘దృశ్యం’లోనే కాదు, ఒరిజినల్ మలయాళ వెర్షన్ ‘దృశ్యం’తో పాటు తమిళ వెర్షన్ ‘పాపనాశం’ లో కమల్ హాసన్ కూతురిగా కూడా నటించి మెప్పించింది. దృశ్యం-2 లో కూడా ఆమె తన నటనతో ఆకట్టుకుంది. ఆ చిన్నారి పాత్రలో ఆమె పలికించిన భయం, అమాయకత్వం సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆమెను చూసిన వారంతా “అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా?” అని ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram
ఎస్తేర్ అనిల్ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోషూట్లు చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తుంటుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూసిన అభిమానులు ఇప్పుడు ఆమెను హీరోయిన్‌గా చూడాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటున్న ఈ భామ, త్వరలోనే టాలీవుడ్‌లో కూడా ఒక మంచి ప్రాజెక్టుతో మెరిసే అవకాశం ఉందని తెలుస్తోంది.



