AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది

దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన "సోగ్గాడు" సినిమాకు ఉదయ్ కిరణ్ నిరాకరించడం, ఆ నిర్ణయం వల్ల కథాగమనంలో వచ్చిన మార్పులను రవిబాబు వివరించారు. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించినా, ఉదయ్ కిరణ్‌ను ఒప్పించలేకపోవడం ఒక పశ్చాత్తాపంగా మిగిలిందని ఆయన పేర్కొన్నారు. ఆ వివరాలు ఇలా..

Actor Ravibabu: ఆ మూవీ ఉదయ్ కిరణ్ చేయనని చెప్పేశాడు.. తను కోపంతో అలా చేయకుండా ఉండాల్సింది
Ravi Babu
Ravi Kiran
|

Updated on: Feb 12, 2026 | 9:32 PM

Share

రవిబాబు దర్శకత్వంలో తరుణ్ హీరోగా తెరకెక్కిన “సోగ్గాడు” చిత్రం వెనుక ఆసక్తికరమైన విషయాలను రవిబాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమా మొదట తరుణ్, ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్‌లతో తీయాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఉదయ్ కిరణ్ చివరి నిమిషంలో సినిమా చేయనని చెప్పడంతో, ఆ పాత్ర కోసం జుగల్ హంసరాజ్‌ను ఎంపిక చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల కథలో మార్పులు చేయాల్సి వచ్చిందని.. హీరోయిన్ తరుణ్ వైపు వెళ్తుందని ప్రేక్షకులకు ముందే తెలిసిపోయిందని రవిబాబు అభిప్రాయపడ్డారు. అసలు క్లైమాక్స్‌లో, రైల్వే స్టేషన్‌లో రెండు వేర్వేరు దిశలకు వెళ్లే రైళ్లలో తరుణ్, ఉదయ్ కిరణ్ ఉండగా, హీరోయిన్ ఎటు వెళ్లాలో తెలియక మధ్యలో ఏడుస్తూ ఉండిపోతుంది.

చివరకు తరుణ్ వైపు నుంచి ఒక గులాబీ పువ్వు ఆమె ముందు పడుతుంది. కానీ, మార్పుల వల్ల ఈ అసలు కథకు భిన్నంగా క్లైమాక్స్ ను సృష్టించాల్సి వచ్చింది. దీనివల్ల అసలు క్లైమాక్స్‌ను మార్చాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఉదయ్ కిరణ్ రిజెక్ట్ చేయడం తన సినీ జీవితంలో పశ్చాత్తాపాన్ని మిగిల్చిందన్నారు. “సోగ్గాడు” చిత్రం రూ. 2.75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, శాటిలైట్ హక్కుల విక్రయం ద్వారా లాభాలను ఆర్జించి, కమర్షియల్‌గా సక్సెస్ సాధించిందని రవి బాబు స్పష్టం చేశారు. హిందీలో దీని రీమేక్ “అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహాని” కూడా విజయవంతమైంది. రవిబాబు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడారు. తన తండ్రి చలపతిరావుతో తనకున్న అనుబంధం చాలా పరిణతి చెందినదని.. రోజూ మాట్లాడుకుంటూ, ఒకరికొకరు విషయాలు పంచుకుంటూ ఉంటామని తెలిపారు.