AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Actress: ఐశ్వర్యారాయ్ , ప్రియాంక చోప్రాల కంటే బాగా రిచ్.. వేల కోట్ల ఆస్తి! ఎవరా ‘మిస్టరీ’ బ్యూటీ?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనిక నటి ఎవరు? అని ఎవరినైనా అడిగితే.. వెంటనే వినిపించే పేర్లు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లేదా దీపికా పదుకొనే. నేటి తరం హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వందల కోట్లు ..

Richest Actress: ఐశ్వర్యారాయ్ , ప్రియాంక చోప్రాల కంటే బాగా రిచ్.. వేల కోట్ల ఆస్తి! ఎవరా 'మిస్టరీ' బ్యూటీ?
Richest Heroine
Nikhil
|

Updated on: Dec 19, 2025 | 11:48 AM

Share

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనిక నటి ఎవరు? అని ఎవరినైనా అడిగితే.. వెంటనే వినిపించే పేర్లు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా లేదా దీపికా పదుకొనే. నేటి తరం హీరోయిన్లు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు, బ్రాండ్ అంబాసిడర్లుగా వందల కోట్లు గడిస్తున్నారు. అయితే, వీరందరినీ దాటేసి ఒక సీనియర్ హీరోయిన్ ‘రిచెస్ట్ హీరోయిన్ ఇన్ ఇండియా’గా అగ్రస్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆమె గత 15 ఏళ్లుగా వెండితెరపై ప్రధాన పాత్రలో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఆమె సంపాదన కేవలం సినిమాల నుంచే కాదు, ఆమెకున్న వ్యాపార సామ్రాజ్యం విలువ తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే!

హారూన్ రిచ్ లిస్ట్ ప్రకారం, ఆ హీరోయిన్​ ఆస్తి విలువ అక్షరాలా రూ.4,600 కోట్లు. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా సుమారు రూ.650 కోట్లు లేదా ఐశ్వర్య రాయ్ రూ.800 కోట్ల కంటే ఈమె ఆస్తి కొన్ని రెట్లు ఎక్కువ. అగ్ర హీరోలతో సమానంగా, ఇంకా చెప్పాలంటే కొందరు స్టార్ హీరోల కంటే కూడా ఎక్కువ ఆస్తిని కలిగి ఉండి, భారత సినీ చరిత్రలోనే అత్యంత సంపన్న నటిగా ఈమె రికార్డు సృష్టించింది. ఇంతకీ ఎవరా హీరోయిన్​?

ఆమె మరెవరో కాదు.. 90వ దశకంలో తన నటనతో, క్యూట్ చిరునవ్వుతో కుర్రకారును ఉర్రూతలూగించిన జుహీ చావ్లా. 1984లో మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న జుహీ, ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా ఎదిగింది. చిరంజీవి వంటి స్టార్లతో తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే, గత 15 ఏళ్లుగా ఆమె సినిమాల్లో కథానాయికగా నటించడం మానేసి, కేవలం అతిథి పాత్రలకు లేదా సహాయ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. మరి సినిమాలకు దూరంగా ఉన్నా ఆమెకు ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి?

Juhi Chawla

Juhi Chawla

జుహీ చావ్లా కేవలం నటి మాత్రమే కాదు, ఒక దార్శనికత కలిగిన వ్యాపారవేత్త. ఆమె సంపద పెరగడానికి ప్రధాన కారణం ఆమె చేసిన తెలివైన పెట్టుబడులే కారణం. తన ఆప్తమిత్రుడు షారూఖ్ ఖాన్‌తో కలిసి ఆమె రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి లాభాలు గడించారు. ఐపీఎల్ టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)లో జుహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా ప్రధాన వాటాదారులు. నేడు ఈ టీమ్ విలువ వేల కోట్లకు చేరుకుంది. ఆమె భర్త జై మెహతా ‘మెహతా గ్రూప్’ అనే అంతర్జాతీయ సంస్థకు అధిపతి. వీరికి ఆఫ్రికా, కెనడా, ఇండియాలో విస్తారమైన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫ్యాక్టరీలు ఉన్నాయి.

సినిమాల్లో అవకాశాలు తగ్గిన తర్వాత చాలామంది నటీనటులు కనుమరుగైపోతారు. కానీ జుహీ చావ్లా మాత్రం తన సెకండ్ ఇన్నింగ్స్‌ను వ్యాపార రంగంలో ప్రారంభించి, దేశంలోనే అత్యంత సంపన్న నటిగా ఎదిగి అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్లామర్ ప్రపంచంలో ఉంటూనే, వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాలో నిరూపించిన జుహీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.