గ్లామర్ ప్రపంచంలో అద్భుతం.. మేకప్ చేసుకోకున్నా కోట్ల ఆఫర్లు ఆమె సొంతం! ఎవరా స్టార్, సీక్రెట్ ఏంటి?
సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. హీరోయిన్లు తెరపై కనిపించాలంటే గంటల తరబడి మేకప్ గదుల్లో గడపాలి, వేల రూపాయల ఖరీదైన కాస్మెటిక్స్ వాడాలి. ఒక్క చిన్న మచ్చ కనిపించినా గ్రాఫిక్స్ (VFX) తో సరిచేసే ఈ కాలంలో.. ఒక నటి మాత్రం వీటన్నిటికీ ..

సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. హీరోయిన్లు తెరపై కనిపించాలంటే గంటల తరబడి మేకప్ గదుల్లో గడపాలి, వేల రూపాయల ఖరీదైన కాస్మెటిక్స్ వాడాలి. ఒక్క చిన్న మచ్చ కనిపించినా గ్రాఫిక్స్ (VFX) తో సరిచేసే ఈ కాలంలో.. ఒక నటి మాత్రం వీటన్నిటికీ భిన్నంగా వెండితెరపై మెరుస్తోంది. ముఖంపై మొటిమలు ఉన్నా, చర్మంపై సహజమైన రంగును దాచకుండా.. కేవలం తన నటనతో, కళ్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఎంతటి పెద్ద హీరో సినిమా అయినా, కోట్లు ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్‌గా రమ్మన్నా “మేకప్ వేసుకోను.. ఫెయిర్నెస్ క్రీములను ప్రమోట్ చేయను” అని తేల్చి చెప్పిన ఆ మొండితనం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఇంతకీ ఎవర ఆ గ్లామర్ క్వీన్?
ఆమె మరెవరో కాదు.. తన డ్యాన్స్‌తో, సహజ సిద్ధమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన సాయిపల్లవి. ‘ప్రేమమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైనప్పుడు ఆమె ముఖంపై ఉన్న మొటిమలను చూసి చాలా మంది విమర్శించారు. కానీ ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. కేవలం తన ప్రతిభనే నమ్ముకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ‘నో-మేకప్’ పాలసీ వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాన్ని ఆమె బయటపెట్టింది.
సాయిపల్లవి సినిమాల్లోకి రాకముందు డాక్టర్ కావాలని చదువుకుంది. ఆ సమయంలో ఆమె కూడా చర్మ సమస్యల వల్ల ఆందోళన చెందిందట. కానీ ఆ తర్వాత ఆమెకు ఒక విషయం అర్థమైందట. “మనుషులు మనల్ని మనలాగే ఇష్టపడాలి.. రంగుతోనో, మేకప్ తోనో కాదు” అని ఆమె గట్టిగా నమ్మిందట. అందుకే తన సినిమాల్లో కేవలం కంటికి కాటుక, పెదవులకు లిప్ బామ్ తప్ప మరే ఇతర హెవీ మేకప్ సామాగ్రిని వాడదు. మరీ ముఖ్యంగా తన ముఖంపై ఉండే మొటిమలను కవర్ చేయడానికి ఆమె అస్సలు ఒప్పుకోదు.

Sai Pallavi
కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ ఫెయిర్నెస్ క్రీమ్ కంపెనీ ఆమెకు ఏకంగా రూ.2 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది. కేవలం ఆ క్రీమ్ వాడితే తెల్లగా అవుతారని ప్రకటనలో చెబితే చాలు. కానీ సాయిపల్లవి ఆ ఆఫర్‌ను నిర్మొహమాటంగా తిరస్కరించింది. “మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం ప్రేమించుకోవాలి.. అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను మోసం చేయలేను” అని ఆమె చెప్పిన సమాధానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నేటి తరం యువతులకు సాయిపల్లవి ఒక గొప్ప స్ఫూర్తి. అందం అంటే రంగులో లేదు, మనం చూపే ఆత్మవిశ్వాసంలో ఉందని ఆమె నిరూపించింది. తన నేచురల్ లుక్ తోనే బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రంగుల లోకంలో ఉంటూ కూడా నిజాయితీగా ఉండటం ఒక్క సాయిపల్లవికే సాధ్యమని ఆమె అభిమానులు గర్వంగా చెప్పుకుంటారు.




