మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసి ఇండస్ట్రీలోకి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శ్రియా.
తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్స్ చేసిన ఈ అమ్మడు.. ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు.
2001లో వచ్చిన ఇష్టం సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసిన శ్రియా.. ఆ తర్వాత 2002లో నాగార్జునతో చేసిన సంతోషం భారీ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా తర్వాత శ్రియాకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. గ్లామర్, ఎమోషనల్ సీన్స్ లో ఆమె పలికించిన హావ భావాలు ప్రేక్షకులను ఫిదా చేశాయి
2002 నుంచి 2004 వరకు తెలుగులో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన శ్రియా.. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది.
దాదాపు 10 ఏళ్ళ పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది. 2018 లో లండన్ కి చెందిన అండీ కోశ్చీవ్ ను పెళ్లాడిన తర్వాత సినిమాలు తగ్గించింది.
కొన్నాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రియా.. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఆర్ఆర్ఆర్, మిరాయ్ వంటి చిత్రాల్లో నటించింది.
నివేదికల ప్రకారం ఈ అమ్మడు ఆస్తులు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందట. ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు తీసుకుంటుందని సమాచారం.