Rajinikanth: రూ.20 కోట్ల విలువైన మ్యారేజ్ హాల్.. రజినీకాంత్ దగ్గరున్న ఖరీదైన వస్తువులు ఇవే..
సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస తెలుపుతున్నారు. అలాగే రజినీకి సంబంధించిన సినీప్రయాణం, వ్యక్తిగత విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.
సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. సాధారణ బస్ కండక్టర్ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్టార్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన డాషింగ్ స్టైల్, మేనరిజం, టాలెంట్ తో అభిమానులను ఫిదా చేశాడు. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. 74 ఏళ్ల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం రజినీ కూలీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ లోకెష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
లైఫ్ స్టైల్ ఏషియా నివేదిక ప్రకారం రజనీకాంత్ నికర విలువ రూ.430 కోట్లు. అలాగే ఒక్కో సినిమాకు రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. జైలర్ సినిమా తర్వాత రజినీ తన రెమ్యునరేషన్ రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లకు పెంచినట్లు సమాచారం. అలాగే రజినీకి చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో విలాసవంతమైన బంగ్లా ఉంది. దీని ధర దాదాపు రూ.35 కోట్లు ఉంటుంది. అలాగే చెన్నైలో రజినీకి సొంతంగా రాఘవేంద్ర కళ్యాణ మండపం కూడా ఉందట. దాని ధర రూ.20 కోట్లు ఉంటుందని టాక్.
రజినీ కలెక్షన్ విషయానికి వస్తే.. రజనీకాంత్ దగ్గర రెండు రోల్స్ రాయిస్ మోడల్స్ ఉన్నాయి. నివేదికల ప్రకారం, రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర రూ. 6 కోట్లు. ఇక రోల్స్ రాయిస్ ఫాంటమ్ ధర రూ.16.5 కోట్లు. ఇవే కాకుండా రజినీ దగ్గర రూ.1.77 కోట్ల విలువైన బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5, రూ. 2.55 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ జి వ్యాగన్, లంబోర్గినీ ఉరస్ ఉన్నాయి. అలాగే రూ.6 కోట్ల విలువైన బెంట్లీ లుమినస్ కారు కూడా ఉంది.
View this post on Instagram
Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?
Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..
Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.