Tollywood: టాలీవుడ్లో కలిసొచ్చినా బాలీవుడ్ వెళ్లింది.. సినిమాలన్నీ హిట్టు.. తీరా చూస్తే..
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఓ రేంజ్ క్రేజ్ అందుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులో అగ్ర కథానాయికగా బిజీగా ఉన్నప్పుడే బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. అక్కడ సైతం వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. కానీ..

సాధారణంగా అభిమానులు సినీ తారల చిన్ననాటి చిత్రాలను చూడటానికి ఇష్టపడతారు. కొంతమందిని చిన్నప్పటి ఫోటోస్ ద్వారా చాలా సులభంగా గుర్తించవచ్చు. కానీ కొంతమందికి అది అంత సులభం కాదు. ఈ టాలీవుడ్ సూపర్ స్టార్ చిన్ననాటి చిత్రాలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ హీరోయిన్ తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ప్రభాస్, రవితేజ, గోపిచంద్ వంటి హీరోల సరసన నటించి అలరించింది. ఇప్పుడు హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే సెటిల్ అయ్యింది. ఇటీవలే తన ప్రియుడిని పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఈ చిన్నారి మరెవరో కాదు.. బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను. తాప్సీ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.
తెలుగులో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది తాప్సీ. ఫస్ట్ మూవీ సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత తెలుగులోనే అనేక ఆఫర్స్ అందుకుంటూ బిజీగా హీరోయిన్ గా మారిపోయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కనిపించింది. తెలుగులో పలు సినిమాల్లో మెరిసిన తాప్సీ… ఇప్పుడు హిందీలో ఎక్కువగా బిజీగా మారిపోయింది. అలాగే మలయాళంలోనూ వరుస అవకాశాలను సంపాదించుకుంది.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన తాప్సీ, మోడలింగ్ నుండి నటనలోకి అడుగుపెట్టింది. తొలినాళ్లలో ఆమె రిలయన్స్ ట్రెండ్స్, ఎయిర్‌టెల్, కోకా-కోలా, రెడ్ ఎఫ్‌ఎం, పివిఆర్ సినిమాస్ వంటి బ్రాండ్‌లకు ప్రకటనలలో నటించింది. తాప్సీ తొలి తమిళ చిత్రం ఆడుకలం. ఆరు జాతీయ అవార్డులను గెలుచుకున్న ఆ చిత్రంతో పాటు, తాప్సీ నటన కూడా దృష్టిని ఆకర్షించింది. తాప్సీ నటించిన చిత్రాలలో పింక్, ముల్క్, బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, తప్పడ్, , షారుఖ్ తో డంకీ కూడా ఉన్నాయి. కొన్నాళ్ల క్రితమే ఆమె డానిష్ బ్యాడ్మింటన్ మథియాస్ బోను పెళ్లి చేసుకుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..




