AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL నుంచి అద్భుత ప్లాన్‌!రూ. 251కే 100 GB డేటా

BSNL నుంచి అద్భుత ప్లాన్‌!రూ. 251కే 100 GB డేటా

Phani CH
|

Updated on: Dec 29, 2025 | 1:38 PM

Share

బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ₹251 అద్భుత రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 28 రోజుల కాలపరిమితితో 100 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు, 30 రోజుల BiTV OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. రోజుకు ₹9 లోపే ఖర్చుతో, ఇది ప్రైవేట్ టెలికాం కంపెనీల అధిక ధరలకు అద్భుత ప్రత్యామ్నాయం. 2026 జనవరి వరకు అందుబాటులో ఈ ప్లాన్ న్యూ ఇయర్ ఆఫర్‌గా వచ్చింది.

భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం ఒక అద్భుత రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలు పెంచుతున్న తరుణంలో, సామాన్యులకు ఊరటనిచ్చేలా కేవలం 251 రూపాయలకే ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. గతంలో కూడా ఈ ధరలో కొన్ని ప్లాన్లు ఉన్నప్పటికీ, ఇప్పుడు పూర్తిస్థాయిలో మార్పులు చేసి 100 GB డేటాను అందిస్తోంది. డేటా వినియోగం ఎక్కువగా ఉండే వారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేందుకు ఇది ఒక చక్కని అవకాశం. ఈ ప్లాన్ ద్వారా లభించే బెనిఫిట్స్‌ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకున్న వారికి 28 రోజుల కాలపరిమితి లభిస్తుంది. ఇందులో రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 100 GB హై-స్పీడ్ డేటాను వాడుకోవచ్చు. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం. వీటితో పాటు అదనంగా BiTV ‘అనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ సబ్‌స్క్రిప్షన్ 30 రోజులు లభిస్తుంది. దీనివల్ల వినియోగదారులు సినిమాలు, టీవీ షోలతో మంచి వినోదాన్ని పొందవచ్చు. న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్లాన్ తెచ్చింది BSNL. ఇది 2026 జనవరి చివరి వరకే ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ తన నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా దాదాపు ఒక లక్ష 4 సైట్లను ఏర్పాటు చేసేందుకు భారీగా నిధులను వెచ్చిస్తోంది. ఇతర కంపెనీల వేగంతో పోటీ పడేలా తమ టవర్లను ఆధునీకరిస్తోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు ఇలాంటి చౌకైన ప్లాన్లను ప్రకటిస్తోంది. రోజువారీ ఖర్చు పరంగా చూస్తే ఈ ప్లాన్ వినియోగదారులకు కేవలం 9 రూపాయల లోపే పడుతుంది. ఇది మార్కెట్లో ఉన్న ఇతర ప్లాన్లతో పోలిస్తే ఎంతో పొదుపుగా ఉంటుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే

బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే

పదో అంతస్తు నుంచి జారి పడ్డాడు.. కట్ చేస్తే ఈ విధంగా బ్రతికి బయటపడ్డాడు..

తండ్రి మొక్కు తీర్చటానికి కొడుకు నిర్ణయం.. 120 కి.మీ మేర పొర్లుదండాలు పెడుతూ యాత్ర

ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్‌