విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా వెళ్తున్న టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. బీ1 బోగీలో మొదలైన మంటలు ఎం2 బోగీకి వ్యాపించాయి. ఈ ఘటనలో 71 ఏళ్ల చంద్రశేఖర్ అనే వృద్ధుడు సజీవదహనమయ్యారు. లోకో పైలట్, ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. దర్యాప్తు కొనసాగుతోంది.