AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీన రాశి వార్షిక ఫలితాలు 2026: అనుకూల పరిస్థితుల కోసం జూన్ వరకు ఆగాల్సిందే..

Pisces 2026 Horoscope: ఏలిన్నాటి శని ప్రభావంతో మీన రాశి వారికి 2026 ప్రథమార్థం ఖర్చులు, అనారోగ్యాలు, ఒత్తిడితో సాగవచ్చు. అయితే, జూన్ తర్వాత గురుబలం వల్ల పరిస్థితులు అనుకూలంగా మారతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ప్రేమ, వివాహాల్లో శుభం, ఆర్థిక స్థిరత్వం ఏర్పడతాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ద్వితీయార్థం అత్యంత విజయవంతంగా ఉంటుంది.

మీన రాశి వార్షిక ఫలితాలు 2026: అనుకూల పరిస్థితుల కోసం జూన్ వరకు ఆగాల్సిందే..
Meena Rashi 2026 Horoscope
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 29, 2025 | 3:44 PM

Share

Meena Rashi 2024 Horoscope: ఏలిన్నాటి శని ప్రభావం కొనసాగుతున్నందువల్ల మీన రాశి వారికి ఈ ఏడాదంతా భారీ ఖర్చులు, కొద్దిపాటి అనారోగ్యాలు, దుర్వార్తా శ్రవణం, ఆదాయం తగ్గడం వంటివి తప్పకపోవచ్చు. జూన్ తర్వాత రాశ్యదిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల పరిస్థితులు బాగా మారే అవకాశం ఉంది. ఎక్కువ భాగం అనుకూలంగానే గడిచిపోతుంది. వ్యక్తిగతంగా, కుటుంబపరంగానే కాక, వృత్తి, ఉద్యోగాలపరంగా కూడా ప్రధానమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొద్దిగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి కానీ అందుకు తగ్గుట్టుగా అనవసర ఖర్చులు పెరుగుతాయి.

ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు

ఏలిన్నాటి శని కారణంగా ప్రతి పనిలోనూ, ప్రతి ప్రయత్నంలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో మాత్రం శ్రమాధి క్యత ఉన్నా లాభాలు ఆశాజనకంగా సాగిపోతాయి. మే నెలాఖరు వరకు ఆర్థికపరంగా, కుటుంబ పరంగా పురోగతి ఉంటుంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ప్రథమార్థంలో వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వామితో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొత్త ఆలోచనలు, నిర్ణయాలను కార్యరూపంలో పెడితే సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యానికి లోటుండదు. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం ఉత్తమంగా, వైభవంగా ఉంటుంది.

ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు

ఉద్యోగ జీవితం మొదటి ఆరు నెలలు సాదా సీదాగా సాగిపోతుంది. పని ఒత్తిడి, పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల మీద ఆశలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆశించిన స్థాయిలో రాబడి పెరగకపోవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా పెద్దగా లాభించకపోవచ్చు. జూన్ తర్వాత మాత్రం కెరీర్ బాగా మారిపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. రాశ్యధిపతి గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఏలిన్నాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోయి, వ్యక్తిగత జీవితం పురోగతి చెందడం ప్రారంభం అవుతుంది. జూన్ వరకు ఈ రాశివారు కొత్త ప్రయత్నాలు చేపట్టే విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు కూడా నిదానంగా సాగడం వల్ల ఉపయోగం ఉంటుంది.

ప్రేమలు, పెళ్లిళ్లు, పిల్లలు

ఈ రాశివారు ప్రథమార్థంలో ప్రేమ ప్రయత్నాల్లో విఫలమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు తృప్తికరంగా సాగకపోవచ్చు. ద్వితీయార్థం మాత్రం ప్రేమ ప్రయత్నాలు, వ్యవహారాలకు బాగా అనుకూలంగా ఉంది. జూన్ తర్వాత సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదరడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలున్నా జూన్ తర్వాత అవి పూర్తిగా తొలగిపోతాయి. విడాకుల కేసులు కూడా అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ద్వితీయార్థంలో సంతాన ప్రాప్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

అనుకూల పరిస్థితులు

ఈ రాశివారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఇంట్లో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభ కార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. ముఖ్యమైన అవసరాలు తీరిపోవడంతో పాటు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి.

అనుకూల నెలలు

ఈ రాశివారికి జూలై నుంచి డిసెంబర్ వరకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలపడుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. దాంపత్య జీవితంలో అనుకూలతలు పెరుగుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.