AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!

ఈ మధ్య ఒక్క సంతానం ట్రెండింగ్‌గా మారిపోయింది. తాతల కాలంలోనలుగురు, ఐదుగురు సంతానం ఉండేది. తర్వాత ముగ్గురు, ఇద్దరికి మారింది. ప్రస్తుత జనరేషన్, కేవలం ఒక్క సంతానమే మేలు అంటూ కుటుంబ నియంత్రణ పద్ధతులపై దృష్టిసారిస్తున్నారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్క సంతానం ఉండటం మంచిది కాదు అంటూ అనేక రూమర్స్ నెట్టిట వైరల్ అవుతున్నాయి. కాగా, దీని గురించి పండితులు ఏమంటున్నారు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Dec 29, 2025 | 3:19 PM

Share

1 / 5
ఈ మధ్య కాలంలో దంపతులు ఒక్క సంతానం వైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. ఇద్దరు లేదా ఒక్క సంతానమే మంచిదనుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్క సంతానం ఉండటం మంచిది కాదు, అలాంటి వారు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెగ భయపెట్టేస్తుంటారు. ముఖ్యంగా ఒక్క కుమారుడు లేదా కూమార్తె ఉన్నవారికి దోషాలు ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఎప్పుడు  ఏ ప్రమాదం ఎదురు అవుతుందో చెప్పలేం, భయం భయంగా బతకాల్సి వస్తుందని చెప్తుంటారు. కానీ ఇది కేవలం అపోహ, మూఢనమ్మకం మాత్రమే అంటున్నారు పండితులు.

2 / 5
తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొందరికి ఒక్క సంతానం అయిన తర్వాత రెండో సంతానం అనేది ఆలస్యం అవ్వడం, రెండో సంతానం కలగక పోవడం జరుగుతుంది. దీంతో వారు అనేక ఇబ్బందులు ఎదర్కోవాల్సి వస్తుంది. అయితే సంతానలేమితో బాధపడే వారు, రెండో సంతానంలో ఆలస్యం అయ్యే వారు, గ్రహ దోషాల కారణంగా కూడా ఈ సమస్యలు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట.

3 / 5
దీనికి కొన్ని పరిహారాలు పాటించడం, గ్రహ దోష నివారణ చేయించుకోవడం వలన సంతానంలోని సమస్యలు తొలిగిపోతాయి.  కీడు గ్రహాల దృష్టి ఎక్కువ ఉండటం, నాగ దోషం,  పుత్ర దోషం వంటి సమస్యలు ఉన్నవారు సంతాన సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారంట.  ముఖ్యంగా రాహు, కేతువుల దోషం, కుజుడు శత్రు స్థానంలో ఉండటం ఇలాంటి సమస్యల వలన ఒక్క సంతానం వద్దే ఆగిపోతుంది. అంతే తప్ప ఒక్కరే సంతానం ఉండటం అరిష్టం, అశుభం కాదు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

4 / 5
 ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక్కరే సంతానం ఉంటే ఏదైనా ప్రమాదం జరుగుతుందో అని భయపడి, సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే, ఒక్కరూ, ఇద్దరూ ఎంత మంది సంతానం ఉన్నా అది మంచిదే, ఆ భగవంతుడు ప్రసాదించినదే. కాబట్టి, మూఢనమ్మకాలు పట్టించుకోకూడదు, మీకు ఏవైనా దోషాలు ఉంటే దోష నివారణ చేయించుకోవాలి. దాన ధర్మాలు చేయాలి , అప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు పండితులు.

5 / 5