AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Telangana Association: ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శనివారం, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి పాల్గొని మాట్లాడారు.

Global Telangana Association: ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి..
Gta Mega Convention 2025
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2025 | 3:32 PM

Share

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో ‘GTA మెగా కన్వెన్షన్ 2025’ వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శనివారం, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి హాజరయ్యారు.. ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. GTA మెగా కన్వెన్షన్ 2025 నిర్వహించడం శుభపరిణామమన్నారు. ఇలాంటి కార్యక్రమంతో తెలంగాణ ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు అభివృద్ధికి తోడ్పాటునందిస్తాయన్నారు.

జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.

Global Telangana Association

Global Telangana Association

తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్టప‌ల్లి సురేంద‌ర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్‌మెంట్ షో నిర్వహించారు. రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద – రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి
ఘనంగా GTA మెగా కన్వెన్షన్.. అభినందించిన త్రిదండి చినజీయర్ స్వామి
కుంభ రాశి వార్షిక ఫలితాలు 2026: కొద్దిపాటి కష్టనష్టాలు
కుంభ రాశి వార్షిక ఫలితాలు 2026: కొద్దిపాటి కష్టనష్టాలు
ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా?
వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే..
వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే..
2026లో తులారాశి వారికి రాజయోగం.. జీవితంలో కొత్త మలుపే
2026లో తులారాశి వారికి రాజయోగం.. జీవితంలో కొత్త మలుపే
న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మీరున్నారా
న్యూమరాలజీ.. 2026లో గవర్నమెంట్ జాబ్ కొట్టేది వీరే.. మీరున్నారా
మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి పక్కా
మకర రాశి వార్షిక ఫలితాలు 2026: కొత్త సంవత్సరంలో ఆదాయ వృద్ధి పక్కా
ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులా ?
ఎవడు మమ్మీ వీడు..ఆరు బంతుల్లో 24 పరుగులా ?
ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!
ఒక్క సంతానం ఉండటం మంచిది కాదా.. ఇది తెలుసుకోకపోతే అరిష్టమే!
ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే
ఏలి నాటి శనితో కష్టాలు పడుతున్నారా.. పాటించాల్సిన పరిహారాలు ఇవే