AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IBOMMA Ravi: అరెస్ట్ తర్వాత తొలిసారి మాట్లాడిన ఐబొమ్మ రవి.. ఏమన్నాడో తెలుసా.. సంచలన వీడియో

కాగా.. పైరసీ కేసులో అరెస్ట్‌ అయినా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి తీరు మారలేదు.. అంతా చేసి.. అన్నీ ఫాల్స్‌ అంటూ పేర్కొన్నాడు.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ ప్రగల్భాలు పలికాడు.. మీడియాపై యాటిట్యూట్‌ చూపించిన ఇమంది రవి.. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో పేర్కొన్నాడు..

IBOMMA Ravi: అరెస్ట్ తర్వాత తొలిసారి మాట్లాడిన ఐబొమ్మ రవి.. ఏమన్నాడో తెలుసా.. సంచలన వీడియో
Ibomma Ravi
Shaik Madar Saheb
|

Updated on: Dec 29, 2025 | 5:19 PM

Share

పైరసీ కింగ్‌పిన్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి కస్టడీ విచారణ పూర్తయింది. ఇమంది రవి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలు కీలక వివరాలను సేకరించారు. పైరసీ ముఠాలతో లింకులు, పైరసీ మూలాలు, బెట్టింగ్‌ యాప్స్‌, ఆర్థిక లావాదేవీలపై మరిన్ని ఆధారాలు సేకరించారు. అంతేకాకుండా.. ప్రహ్లాద్‌ వెల్లేల పేరిట రవి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడంతో.. హైదరాబాద్ పోలీసులు అతని పాత్రపై కూడా నిగ్గు తేల్చారు.. బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను పిలిపించి విచారించారు. కస్టడీలో ఉన్న ఇమంది రవి ఎదుటే ప్రహ్లాద్‌ను పోలీసులు ప్రశ్నించి పలు వివరాలు సేకరించారు. అయితే.. 12 రోజులపాటు రవిని విచారించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. నేటితో కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు రవిని తరలించారు. ఒక్కో కేసులో నాలుగు రోజుల చొప్పున.. మూడు కేసుల్లో 12 రోజులపాటు పోలీసులు విచారించారు.

అవన్నీ ఫాల్స్‌.. అంటూ..

కాగా.. పైరసీ కేసులో అరెస్ట్‌ అయినా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి తీరు మారలేదు.. అంతా చేసి.. అన్నీ ఫాల్స్‌ అంటూ పేర్కొన్నాడు.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటానంటూ ప్రగల్భాలు పలికాడు.. మీడియాపై యాటిట్యూట్‌ చూపించిన ఇమంది రవి.. సరైన సమయంలో వాస్తవాలు బయటపెడతానంటూ కోర్టు ఆవరణలో పేర్కొన్నాడు.. ఈ సందర్భంగా ఐబొమ్మ రవి టీవీ9 తోమాట్లాడాడు.. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని.. బెట్టింగ్ యాప్స్‌తో సంబంధాలున్నాయని ఎవరు చెప్పారంటూ పేర్కొన్నాడు.. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా అంటూ టీవీ9తో ఐ బొమ్మ రవి పేర్కొన్నాడు.. తనపేరు ఐ బొమ్మ రవి కాదని.. పోలీసులు చెబితే నేరం చేసినట్టా..? అంటూ పేర్కొన్నాడు. తాను ఎక్కడికీ పారిపోలేదు..కూకట్‌పల్లిలోనే ఉన్నాని.. వేరే దేశంలో సిటిజన్‌షిప్‌ మాత్రమే తీసుకున్నా అంటూ ఐబొమ్మ రవి పేర్కొన్నాడు.

ఐబొమ్మ రవి వీడియో..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
కవ్వించి పొదల్లోకి తీసుకెళ్తుంది.. ఆ తర్వాత....
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
ఇదేం సిగ్గులేని పని.. లైవ్‌లో అసభ్యకరమైన సైగలు.. కట్‌చేస్తే..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
గ్యాస్ సిలిండర్ వాడే వారికి భారీ షాక్.. వీళ్లకు సబ్సిడీ కట్‌..
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
అవతార్ లో తన ముఖమే వాడారంటున్న నటి.. కామెరాన్‌పై కోర్టులో దావా
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
Google Payలో 'పాకెట్ మనీ' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే డబ్బులు పోతాయా?
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
బాబా వంగా జోస్యం.. మే 16 నుంచి ఈ రాశులకు బంగారం లాంటి భవిష్యత్తే
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అపర ఏకాదశి రహస్యం.. సంపద రావాలంటే ఇవి చేయండి.. ఇలా చేస్తే నష్టం త
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు ICAR AIEEA 2026 నోటిఫికేషన్‌
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
మళ్లీ నోరుజారిన సప్తగిరి.. మండిపడుతోన్న ప్రభాస్ ఫ్యాన్స్.. వీడియో
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?
ఆఫ్ఘాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. ఆ ఓపెనర్‌కు షాకిచ్చిన గంభీర్.?