Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 The Rule: సెంచరీ కొట్టేసిన అల్లు అర్జున్ పుష్ప2.. మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో చూశారా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప 2.. ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు దులిపేసింది. ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి దంగల్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా చరిత్ర సృష్టించింది.

Pushpa 2 The Rule: సెంచరీ కొట్టేసిన అల్లు అర్జున్ పుష్ప2.. మేకర్స్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో చూశారా?
Pushpa 2 Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 15, 2025 | 10:33 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2.. ది రూల్ గతేడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి భారతీయ బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. అమిర్ ఖాన్ దంగల్ తర్వాత (రూ. 2,070 కోట్లు) భారీ కలెక్షన్లు సాధించిన రెండో సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. కాగా ఈ బ్లాక్ బస్టర్ మూవీ విడుదలై 100 రోజులు పూర్తయ్యాయి. దీంతో మేకర్స్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘ఇండియన్ సినిమా ఇండస్ట్రీ పుష్ప 2 ది రూల్.. 100 డేస్. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ బద్దలు కొడుతూ.. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది’ అంటూ ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేశారు. సుమారు 38 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ను కొన్నింటిని జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది.

కాగా సుకుమార్ తెరెక్కించిన ‘పుష్ప 2’ చిత్రం లో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫహద్ ఫాసిల్, సునీల్, రావు రమేష్, డాలీ ధనంజయ్, తారక్ పొన్నన్న,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఇవి కూడా చదవండి

ఓటీటీలోనూ రప్పా రప్పా.

కాగా ప్రస్తుతం పుష్ప 2 సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 05న విడుదలైనప్పుడు లేని 25 నిమిషాల అదనపు సన్నివేశాలను ‘పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్’ లో చేర్చి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.