తెలంగాణ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు సోమవారం ఆసక్తికర దృశ్యం కనిపించింది. సుదీర్ఘకాలం తర్వాత ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి కేసీఆర్ సీటు వద్దకు వెళ్లి పలకరించారు. బాగున్నారా అంటూ ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. కేసీఆర్ రేవంత్ రెడ్డితో షేక్ హ్యాండ్ చేశారు.